• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్‌లో కొత్త...

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ మొదలైంది

| హీరోయిన్లుగా కాకుండా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న టాలీవుడ్ స్టార్ కిడ్స్ సంఖ్య పెరుగుతోంది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, బాలకృష్ణ కుమార్తె తేజస్విని నిర్మాతలుగా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇప్పటికే నిహారిక కొణిదెల, మోక్షద, శివాత్మిక, మంచు లక్ష్మి నిర్మాణ రంగంలో కొనసాగుతున్నారు. దీంతో టాలీవుడ్‌లో మహిళా నిర్మాతల కొత్త ట్రెండ్ మొదలవుతోంది.

By - Ramesh Palla
Update: 2026-11-26 08:49 GMT

టాలీవుడ్‌లో వారసులు అనగానే హీరోలు గుర్తుకు వస్తారు. బాలీవుడ్‌లో మాదిరిగా హీరోల కూతుర్లు, నిర్మాతల కూతుర్లు హీరోయిన్స్‌గా సక్సెస్‌ కాలేక పోతున్నారు. టాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్‌కి హీరోయిన్‌గా సక్సెస్‌ దక్కదని ఇప్పటికే చాలా మంది విషయంలో నిరూపితం అయ్యింది. తెలుగు అమ్మాయిలు అసలు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకోవడమే గగనం అనుకుంటే, స్టార్స్‌గా మారడం అనేది దాదాపు అసాధ్యం అన్నట్లుగా పరిస్థితి ఉంది. అందుకే అనవసర ప్రయత్నం ఎందుకు అని చాలా మంది స్టార్‌ కిడ్స్ హీరోయిన్స్‌గా కాకుండా ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది నిర్మాణం వైపు దృష్టి పెడితే, కొందరు మాత్రం దర్శకత్వం వైపు, కొందరు కాస్ట్యూమ్స్ డిజైనింగ్‌ వైపు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్‌ కిడ్స్‌ నిర్మాణంలో అడుగు పెట్టడంతో కొత్త ట్రెండ్‌ మొదలైంది.

చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా...

మెగాస్టార్‌ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఇప్పటికే నిర్మాతగా పలు ప్రాజెక్ట్‌లు చేసింది. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సుస్మిత చేస్తున్న ప్రాజెక్ట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుస్మిత తన తండ్రి చిరంజీవి హీరోగానూ ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. వెబ్‌ సిరీస్‌లు నిర్మించి మంచి స్పందన దక్కించుకున్న సుస్మిత ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి టాక్‌ షో ను నిర్మిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ కోసం మెగావర్స్ అనే టాక్‌ షో ను చిరంజీవి హోస్ట్‌గా సుస్మిత నిర్మిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈమె పై ఉంది. భవిష్యత్తులో సుస్మిత టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సుస్మిత త్వరలోనే తన సోదరుడు రామ్‌ చరణ్‌ తోనూ ఒక సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి, రామ్‌ చరణ్‌ కాంబో మూవీని నిర్మించాలని ఆమె డ్రీమ్‌గా తెలుస్తోంది.

తేజస్విని నందమూరి నిర్మాతగా సినిమా షూరూ...

ఇప్పుడు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సైతం నిర్మాతగా అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈమె ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతోంది. తన తండ్రి సినిమాలకు సంబంధించిన కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ను చూసుకోవడంతో పాటు, అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో కి తెర వెనుక ఉండి చాలా గట్టి కాంట్రిబ్యూషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు నిర్మాతగా తేజస్విని ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే తేజస్విని ఒక సినిమాను తన బ్యానర్‌ లో మొదలు పెట్టింది. ఆ సినిమా షూటింగ్‌ సైతం ప్రారంభం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. తేజస్విని మొదటి సినిమా తన తండ్రి బాలకృష్ణ తో కాకుండా బయటి హీరో అది కూడా చిన్న హీరో తో కావడం విశేషం. మీడియం రేంజ్‌ బడ్జెట్‌తో తేజస్విని సినిమాను నిర్మిస్తుంది. ముందు ముందు బాలకృష్ణ తోనూ సినిమా ను నిర్మించే అవకాశాలు ఉన్నాయి.

టాలీవుడ్‌లో కొత్త నిర్మాతలు...

సుస్మిత, తేజస్విని మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు వారసులుగా వచ్చి నిర్మాతలుగా తమ సత్తా చాటే ప్రయత్నాలు చేస్తున్నారు. నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల చాలా కాలంగా నిర్మాతగా దూసుకు పోతుంది. చిన్న సినిమాలు చేస్తూ మంచి నిర్మాతగా పేరు తెచ్చుకుంది. పింక్ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ లో నిహారిక సినిమాలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అంతా కొత్తవారితో ఈమె చేస్తున్న ప్రయోగాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. రవితేజ కూతురు మోక్షద సైతం నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈమె తండ్రి సినిమాల నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటుంది. ఇక రాజశేఖర్‌ కూతురు శివాత్మిక సైతం ఒకటి రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. మోహన్‌ బాబు కూతురు మంచు లక్ష్మి నిర్మాతగా చాలా సినిమాలు చేసింది. విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన మంచు లక్ష్మి మరిన్ని ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ట్రెండ్‌ కొనసాగి మరింత మంది అమ్మాయిలు నిర్మాతలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • tollywood 
  • sushmitakonidela 
  • tejaswininandamuri 
  • niharikakonidela 
  • mokshada 

Similar News

ముల్లోకాల దేవతలూ దీవిస్తున్నారంటూ కంగనా ఆశీర్వాదం!

2026-11-26 09:07 GMT

సేతుపతి న‌ట‌నకు అవాక్క‌యిన హాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు!

2026-11-26 09:07 GMT

అమిత్‌ షాతో భేటీలో రావణుడు ఎక్కడ..?

2026-11-26 09:06 GMT

రేర్‌ ఫీట్‌... 115 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌

2026-11-26 09:05 GMT

క్రిస్మస్‌, సంక్రాంతికి సినిమాల సందడే సందడి

2026-11-26 09:02 GMT

ఎనిమిది గంటల షిఫ్ట్..బడా నిర్మాతలు దూరం!

2026-11-26 08:59 GMT

శర్వానంద్‌ 'భోగి' కి పోటీగా ఎవరు ఉన్నారు?

2026-11-26 08:58 GMT

మూడు వారాల్లోనే 'పుష్ప 2' రికార్డు బ్రేక్!

2026-11-26 08:58 GMT

నిషేధం వేళ పెళ్లిలో ఆతిఫ్ అస్లాంతో కలిసిన‌ హనీ సింగ్!

2026-11-26 08:56 GMT

సినిమా అయిపోయినా సీటు నుంచి లేవని పెద్దాయన.. కారణం తెలిస్తే నవ్వాల్సిందే!

2026-11-26 08:54 GMT

మూతపడే స్థితిలో ఉన్న ఇండస్ట్రీకి ఊపిరి పోసిన సినిమా!

2026-11-26 08:50 GMT

Copyright @2026

Powered by Blink CMS