• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముల్లోకాల దేవతలూ...

ముల్లోకాల దేవతలూ దీవిస్తున్నారంటూ కంగనా ఆశీర్వాదం!

| రచయిత, నిర్మాత అమిత్ తూలీ తన ప్రేయసి గరిమను పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు హాజరైన కంగనా రనౌత్ కొత్త జంటపై పూలు చల్లుతూ ఆశీర్వదించారు. సంప్రదాయ బాటిల్ గ్రీన్ లెహెంగాలో మెరిసిన ఆమె.. వధూవరులకు షగున్ అందించి ఆప్యాయతను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.

By - Srikanth Kontham
Update: 2026-11-26 09:07 GMT

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సన్నిహితుడు.. రచయిత.. నిర్మాత అమిత్ తూలీ పెళ్లి వేడుకలో సందడి చేశారు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న గరిమతో అమిత్ తూలీ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు హాజరైన కంగనా కొత్త జంటపై పూలు చల్లుతూ.. నవ్వులు చిందిస్తూ ఆశీర్వదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈవెంట్ నిర్వాహకులు పంచుకున్న వీడియోలో వధూవరులు చేతిలో చేయి వేసుకుని నిల్చున్న సమయంలో కంగనా వారిపై పూల వర్షం కురిపించారు.

ఆ సమయంలో ముల్లోకాల దేవతలూ మీపై పూలు కురిపి స్తున్నారంటూ హిందీలో ఉత్సాహంగా ఆశీర్వదించారు. అటుపై షగున్ అందించి ఇద్దరికీ ముద్దు పెడుతూ ఆప్యాయతను పంచుకున్నారు. పెళ్లి వేడుక కోసం కంగనా సంప్రదాయ పద్ధతిలో ముస్తాబయ్యారు. ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఉన్న బాటిల్ గ్రీన్ లెహెంగా దానికి తగ్గ దుపట్టాలో ప్రత్యేకంగా కనిపించారు. లేయర్డ్ నెక్లెస్.. పెద్ద జుంకాలు.. మాంగ్ టీకా వంటి బంగారు ఆభరణాలతో లుక్‌ను పూర్తి చేశారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కంగ‌న సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు.

అమిత్ తూలీ రచయిత, నిర్మాతగానే కాకుండా మార్కెటింగ్ రంగంలోనూ చురుగ్గా ఉన్నారు. కంగనా నటించిన `భారత్ భాగ్య విధాత` చిత్ర డిజిటల్ మార్కెటింగ్‌లో ఆయనకు చెందిన స్టూడియో ఉనీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పాలుపంచుకుంది. అలాగే `హనుమాన్ అంశ్` ప్రచారం.. మార్కెటింగ్ వ్యవహారాలను కూడా చూసింది. 2015లో వచ్చిన `31st అక్టోబర్` సినిమాకు అమిత్ సహ రచయితగా పని చేసారు.

కంగనా సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది `భారత్ భాగ్య విధాత` తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. 2008 ముంబై దాడుల సమయంలో కామా ఆసుపత్రి వైద్యులు.. సిబ్బంది చూపిన ధైర్యసాహసాల ఆధారంగా మనోజ్ తపాడియా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు.

ప్ర‌స్త‌తుం కంగనా `స్కేరీ పిక్చర్` అనే హారర్ చిత్రంలో న‌టిస్తున్నారు. తెలుగులో పలు హారర్ సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు రవిబాబు ఈ సినిమాతో హిందీలోకి అడుగు పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు. అలాగే `క్వీన్ 2`.. `స్కారీ పిక్చ‌ర్స్` లోనూ న‌టిస్తున్నారు.

Tags:    
  • kanganaranaut 
  • amitthule 
  • garima 
  • kanganaweddingvideo 

Similar News

సేతుపతి న‌ట‌నకు అవాక్క‌యిన హాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు!

2026-11-26 09:07 GMT

అమిత్‌ షాతో భేటీలో రావణుడు ఎక్కడ..?

2026-11-26 09:06 GMT

రేర్‌ ఫీట్‌... 115 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌

2026-11-26 09:05 GMT

క్రిస్మస్‌, సంక్రాంతికి సినిమాల సందడే సందడి

2026-11-26 09:02 GMT

ఎనిమిది గంటల షిఫ్ట్..బడా నిర్మాతలు దూరం!

2026-11-26 08:59 GMT

శర్వానంద్‌ 'భోగి' కి పోటీగా ఎవరు ఉన్నారు?

2026-11-26 08:58 GMT

మూడు వారాల్లోనే 'పుష్ప 2' రికార్డు బ్రేక్!

2026-11-26 08:58 GMT

నిషేధం వేళ పెళ్లిలో ఆతిఫ్ అస్లాంతో కలిసిన‌ హనీ సింగ్!

2026-11-26 08:56 GMT

సినిమా అయిపోయినా సీటు నుంచి లేవని పెద్దాయన.. కారణం తెలిస్తే నవ్వాల్సిందే!

2026-11-26 08:54 GMT

మూతపడే స్థితిలో ఉన్న ఇండస్ట్రీకి ఊపిరి పోసిన సినిమా!

2026-11-26 08:50 GMT

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ మొదలైంది

2026-11-26 08:49 GMT

Copyright @2026

Powered by Blink CMS