• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సేతుపతి న‌ట‌నకు...

సేతుపతి న‌ట‌నకు అవాక్క‌యిన హాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు!

| విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ చిత్రంపై హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత టామ్ హ్యాంక్స్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సేతుపతి, బాలనటి సచనా నమిదాస్ నటన తనను కదిలించిందని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా హాలీవుడ్ రీమేక్‌లో చిన్న పాత్ర వచ్చినా నటిస్తానని సేతుపతి వెల్లడించారు.

By - Sivaji Kontham
Update: 2026-11-26 09:07 GMT

భారతదేశంలోనే ఫైనెస్ట్ పెర్ఫామర్.. జాతీయ అవార్డు గ్రహీత విజయ్ సేతుపతి నటనా ప్రతిభకు హాలీవుడ్ దిగ్గజం సైతం ఫిదా అయ్యారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నిథిలన్ సామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం `మహారాజా` అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటూనే ఉంది. ఈ సినిమాపై కొన్ని నెల‌లుగా ప్ర‌శంస‌కుల లిస్ట్ పెద్ద‌ద‌వుతూనే ఉంది. తాజాగా ఆస్కార్ విజేత, హాలీవుడ్ లెజెండరీ నటుడు టామ్ హ్యాంక్స్ ఈ చిత్రాన్ని వీక్షించి అవాక్కయ్యారు. `ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా` కథనం ప్రకారం... సేతుపతి నటనతో పాటు ఈ సినిమాలో ఆయన కుమార్తెగా నటించి జాతీయ అవార్డు గెలుచుకున్న యువ నటి సచనా నమిదాస్ అద్భుత అభినయాన్ని చూసి టామ్ హ్యాంక్స్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా, విజయ్ సేతుపతితో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో లాస్ ఏంజెల్స్‌లోని లాక్మా గాలా వేడుకలో టామ్ హ్యాంక్స్ తనను కలిసి చూడదగ్గ మూడు భారతీయ సినిమాలను సూచించమని కోరగా.. తాను `మహారాజా` పేరు చెప్పానని కవితా గుప్తా తెలిపారు. ఆ తర్వాత నవంబర్ 7న జరిగిన మరో వేడుకలో కలిసినప్పుడు టామ్ హ్యాంక్స్ స్వయంగా ఈ సినిమా ప్రస్తావన తెచ్చి తన అనుభూతిని పంచుకున్నారని ఆమె వివరించారు.

``నేను ఇంకా ఆ అమ్మాయి నటన నుంచి బయటపడలేకపోతున్నాను.. ఈ అమ్మాయి ఎంత అద్భుతమైన నటి! ఆ కథలో తండ్రి పాత్ర చేసినట్లుగా నేనైతే చేయలేకపోయేవాడిని... ఆ విలన్‌ను కచ్చితంగా చంపేసేవాడిని`` అంటూ టామ్ హ్యాంక్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక హాలీవుడ్ దిగ్గజ నటుడే తాను చేయలేనంత గొప్పగా విజయ్ సేతుపతి ఆ పాత్రలో ఒదిగిపోయారని కితాబివ్వడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో అవార్డును ప్రదానం చేసిన తొలి భారతీయ సినీ నటుడిగా సేతుపతి చరిత్ర సృష్టించిన వేళ.. ఈ ప్రశంసలు చిత్ర బృందానికి మరింత గర్వకారణంగా నిలిచాయి.

తన తాజా చిత్రం `బత్తా` విజయాన్ని ఆస్వాదిస్తున్న విజయ్ సేతుపతి `మహారాజా` హాలీవుడ్ రీమేక్‌పై అధికారికంగా స్పందించారు. `మహారాజా` హాలీవుడ్‌లో రీమేక్ కానుందని ధృవీకరించిన సేతుప‌తి ఆ రీమేక్‌లో ఏదైనా చిన్న పాత్రలోనైనా నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తన నిర్మాతకు చెప్పినట్లు తెలిపారు. అయితే ఈ హాలీవుడ్ రీమేక్‌లో విజయ్ సేతుపతి పోషించిన తండ్రి పాత్ర కోసం ఆస్కార్ విజేత మాథ్యూ మెక్‌కోనాఘే పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం విశేషం.

పూరితో సినిమా ప‌రిస్థితేంటి?

అంతర్జాతీయ సినీ వేడుకలు, ఎమ్మీ అవార్డుల వేదికపై ప్రశంసలు అందుకుంటూ గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటున్న విజయ్ సేతుపతి.. ఇప్పుడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో చేస్తున్న సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ పాత తరహా మాస్ ఫార్ములాకు విజయ్ సేతుపతి సహజ సిద్ధమైన నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ వేదికలపై సేతుపతి అందుకుంటున్న ప్రశంసలు ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్, హైప్ తీసుకురావడానికి ఉపయోగపడినా.. అంతిమంగా థియేటర్లలో పాజిటివ్ రిజల్ట్ అందుకోవాలంటే మాత్రం పూరి తన పాత మూస ధోరణిని వీడి సేతుపతి ఇమేజ్‌కు తగ్గ బలమైన కంటెంట్‌ను అందిస్తేనే ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయగలదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    
  • vijaysethupathi 
  • maharaja 
  • tomhanks 
  • matthewmcconaughey 

Similar News

ముల్లోకాల దేవతలూ దీవిస్తున్నారంటూ కంగనా ఆశీర్వాదం!

2026-11-26 09:07 GMT

అమిత్‌ షాతో భేటీలో రావణుడు ఎక్కడ..?

2026-11-26 09:06 GMT

రేర్‌ ఫీట్‌... 115 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌

2026-11-26 09:05 GMT

క్రిస్మస్‌, సంక్రాంతికి సినిమాల సందడే సందడి

2026-11-26 09:02 GMT

ఎనిమిది గంటల షిఫ్ట్..బడా నిర్మాతలు దూరం!

2026-11-26 08:59 GMT

శర్వానంద్‌ 'భోగి' కి పోటీగా ఎవరు ఉన్నారు?

2026-11-26 08:58 GMT

మూడు వారాల్లోనే 'పుష్ప 2' రికార్డు బ్రేక్!

2026-11-26 08:58 GMT

నిషేధం వేళ పెళ్లిలో ఆతిఫ్ అస్లాంతో కలిసిన‌ హనీ సింగ్!

2026-11-26 08:56 GMT

సినిమా అయిపోయినా సీటు నుంచి లేవని పెద్దాయన.. కారణం తెలిస్తే నవ్వాల్సిందే!

2026-11-26 08:54 GMT

మూతపడే స్థితిలో ఉన్న ఇండస్ట్రీకి ఊపిరి పోసిన సినిమా!

2026-11-26 08:50 GMT

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ మొదలైంది

2026-11-26 08:49 GMT

Copyright @2026

Powered by Blink CMS