జిమ్‌లో కష్టపడుతున్న ముద్దుగుమ్మ కయాదు లోహర్‌

హీరోయిన్‌గా కయాదు లోహార్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా ఐదేళ్లు అవుతుంది.;

Update: 2025-11-13 11:30 GMT

హీరోయిన్‌గా కయాదు లోహార్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా ఐదేళ్లు అవుతుంది. కన్నడ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాతమలయాళం, తెలుగు సినిమాల్లోనూ నటించింది. తెలుగులో ఈమె చేసిన అల్లూరి సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. దాంతో కయాదు లోహర్‌ కెరీర్ పరంగా మళ్లీ పుంజుకోవడం కష్టమే అని ఆమె సన్నిహితులే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ ఏడాదిలో ఆమె నటించిన డ్రాగన్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా పరిస్థితులను మార్చేసింది. తమిళ్‌, తెలుగులో ఆమె బిజీ అయ్యే విధంగా డ్రాగన్‌ మూవీ హిట్ అయింది. ప్రస్తుతం కయాదు చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో ఒక తెలుగు సినిమా కూడా ఉండటం విశేషం. రాబోయే రోజుల్లో కయాదు మోస్ట్‌ వాంటెడ్‌, పాపులర్‌ హీరోయిన్‌గా నిలవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కయాదు లోహర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ...

తమిళ్‌తో పాటు మలయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తున్న కయాదు లోహర్‌ ఈ మధ్య కాలంలో బరువు తగ్గినట్లు ఆమె సన్నిహితులు, ఫాలోవర్స్ చెబుతున్నారు. హీరోయిన్‌గా వరుస ఆఫర్లు వస్తున్న కారణంగా కయాదు లోహర్‌ బరువు తగ్గి మరింతగా స్టార్‌డం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కయాదు లోహర్ జిమ్‌ లో ఎక్కువగా కష్టపడుతోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కయాదు షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రైనర్ సమక్షంలో కయాదు లోహర్‌ లోహర్‌ బాక్సింగ్‌ ట్రైనింగ్‌ అవుతోంది. సాధారణంగా ముద్దుగుమ్మలు బాక్సింగ్‌ వంటి కఠినమైన విషయాల్లో ట్రైనింగ్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపించరు. కానీ ఈ అమ్మడు మాత్రం తన ఫిజిక్ పై మరింత శ్రద్దతో ఏకంగా బాక్సింగ్‌ ను ప్రాక్టీస్ చేస్తుంది అంటూ ఆమె సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

టాలీవుడ్‌ మూవీ ఫంకీలో కయాదు

తెలుగులో ఈమె విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ మూవీ లో నటిస్తోంది. అనుదీప్ కేవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. జాతిరత్నాలు వంటి సినిమాతో దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న అనుదీప్‌ కేవీ ఈసారి మరో విజయాన్ని ఫంకీ సినిమాతో తన ఖాతాలో వేసుకుంటాను అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నాడు. తెలుగులో వచ్చిన అల్లూరి సినిమాతో పరిచయం అయిన కయాదు ఆ సినిమాతో మెప్పించలేక పోయింది. కానీ ఇప్పుడు కయాదు ఏకంగా విశ్వక్‌ సేన్ వంటి క్రేజీ హీరోతో, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో సినిమా చేస్తున్న కారణంగా కచ్చితంగా టాలీవుడ్‌కి రీ ఎంట్రీ అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది.

కోలీవుడ్‌తో పాటు మలయాళంలోనూ సినిమాలు..

కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కయాదు ఏకంగా మూడు సినిమాలు చేస్తోంది. మూడు సినిమాలకు మూడు సినిమాలు క్రేజీ ప్రాజెక్ట్‌లుగా రూపొందుతున్నాయి. ప్రతి సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కయాదు లోహర్‌ మలయాళంలో చేస్తున్న సినిమాతోనూ అక్కడ ముందు ముందు మరిన్ని సినిమా ఆఫర్లు వస్తాయి అంటున్నారు. మొత్తానికి తెలుగు, తమిళ్‌, మలయాళంలో రాబోయే రోజుల్లో కయాదు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌ ఉన్న కయాదు లోహర్ ఇంకా కూడా జిమ్‌ లో కష్టపడుతూ తన అందంను పెంచుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ముందు ముందు టాప్‌ స్టార్‌ హీరోలకు ఈమె జోడీగా నటించడం పెద్ద కష్టం ఏమీ కాదని కొందరు అంటున్నారు.

Tags:    

Similar News