బిగ్ బాస్ అగ్నిపరీక్షపై కౌశల్ కామెంట్స్..!

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోపై ఒకప్పటి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మంద కామెంట్స్ వైరల్ గా మారాయి. బిగ్ బాస్ సీజన్ 2 లో అందరు కంటెస్టెంట్స్ ఒకవైపు తానొక వైపు అనేలా చేశాడు.;

Update: 2025-08-24 14:30 GMT

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోపై ఒకప్పటి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మంద కామెంట్స్ వైరల్ గా మారాయి. బిగ్ బాస్ సీజన్ 2 లో అందరు కంటెస్టెంట్స్ ఒకవైపు తానొక వైపు అనేలా చేశాడు. బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ మంద కోసం ఒక ఫ్యాన్ ఆర్మీ కూడా సిద్ధమైంది. అసలు బిగ్ బాస్ షో అంత పీక్స్ కి వెళ్లింది అక్కడినుంచే. మొదటి సీజన్ పూణెలో జరిగింది. ఫస్ట్ సీజన్ శివ బాలాజి విన్నర్ కాగా.. రెండో సీజన్ కౌశల్ కూడా తన ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పించాడు.

షోకి జడ్జిలుగా..

ఐతే బిగ్ బాస్ సీజన్ 9 కోసం కామన్ మ్యాన్ ని తీసుకొచ్చే క్రమంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒక షో మొదలు పెట్టారు. ఐతే ఈ షోకి జడ్జిలుగా అభిజిత్, బిందు మాధవితో పాటుగా సీజన్ 1 లో మిస్టర్ ఎంటర్టైనర్ అయిన నవదీప్ ని తీసుకొచ్చారు. ఐతే ఈ విషయంపై కౌశల్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో ముగ్గురు జడిలలో అభిజిత్, బింధు మాధవి ఓకే కానీ నవదీప్ మాత్రం నాట్ ఓకే అన్నాడు.

బిగ్ బాస్ ని టార్గెట్ చేస్తూ..

అతని బదులు ఇంకా గెలిచిన వాళ్లు ఉన్నారు వాళ్లని ఎందుకు తీసుకోలేదని అంటున్నాడు. ఇక బిగ్ బాస్ టీం తనని పిలవరని. షో టైం లోనే మిగతా వాళ్లందరు ఒకటైతే తానొకటిగా ఉన్నాను. ఆ టైం లో ఆడియన్స్ వల్ల తను గెలిచానని.. మిగతా అన్ని సీజనకు మంచి రేటింగ్ వచ్చిందని అన్నారు. ఆ విషయంలో నక్కకు నాగ లోకానికి ఉన్నట్టుగా చెప్పాడు కౌశల్. ఐతే బిగ్ బాస్ బాస్ గెలిచిన తర్వాత కూడా కౌశల్ ఒక్కసారి కూడా బిగ్ బాస్ టీం తో కలవలేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బిగ్ బాస్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తాడు. ఇప్పుడు బిగ్ బాస్ అగ్నిపరీక్ష కు తనని పిలవలేదని డిజప్పాయింట్ తో ఉన్నాడు కౌశల్.

మరి కౌశల్ అన్నట్టుగా కేవలం గెలిచిన వాళ్లే జ్యూరీ ఉండాలన్న రూల్ ఏమి లేదు. నవదీప్ మంచి ఎంటర్టైనర్ తన పాయింట్ ని గట్టిగా చెప్పగలడు. సో నవదీప్ కి ఈ ఛాన్స్ ఇవ్వడంలో తప్పులేదు. మరి కౌశల్ ఎన్నాళ్లు ఇలా బిగ్ బాస్ ని టార్గెట్ చేస్తూ ఉంటాడన్నది చూడాలి.

Tags:    

Similar News