ఘనంగా విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ నిశ్చితార్థం.. పెళ్లెప్పుడంటే ?

కొంతమంది దర్శకులు ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేస్తారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ డైరెక్టర్ కూడా ఒక్కరు.;

Update: 2025-09-29 04:54 GMT

కొంతమంది దర్శకులు ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేస్తారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ డైరెక్టర్ కూడా ఒక్కరు. ఆయన ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశారు.. అదే విరూపాక్ష మూవీ..మెగా మేనల్లుడు పంజా సాయి దుర్గ తేజ్ హీరోగా తెరకెక్కిన విరూపాక్ష మూవీ అందరూ చూసే ఉంటారు. హార్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన విరూపాక్ష సినిమా చూశాక చాలామంది ఈ సినిమా దర్శకుడి దర్శకత్వానికి ఫిదా అయిపోయారు.

అలా రెండో సినిమాకే ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు.. ఈ సినిమాతో సౌత్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సాయి దుర్గ తేజ్ యాక్సిడెంట్ అయ్యాక కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత వచ్చిన విరూపాక్ష మూవీ ఆయన కెరీర్ కి కూడా ప్లస్ అయ్యింది. అయితే అలాంటి కార్తిక్ వర్మ దండు తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.. కార్తీక్ వర్మ దండు హర్షిత అనే అమ్మాయితో ఆదివారం రోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. హైదరాబాదులో గ్రాండ్ గా వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది.. కార్తీక్ వర్మ దండు ఎంగేజ్మెంట్ వేడుకకి ఇండస్ట్రీ నుండి చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తో పాటు హీరో సాయి దుర్గ తేజ్, నాగచైతన్య,శోభిత దూళిపాళ్ల వంటి కొంతమంది సెలబ్రిటీలు వీరి నిశ్చితార్థ వేడుకకు హాజరై సందడి చేశారు.

బంధుమిత్రులు వీరి నిశ్చితార్థ వేడుకకు వచ్చి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు, హర్షితలకు సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దాంతో చాలామంది నెటిజన్లు ఇదేంటి ఈ డైరెక్టర్ ఇంత పెద్ద షాక్ ఇచ్చారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. కార్తీక్ వర్మ దండు గత మూడు నెలల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు కొన్ని ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. కానీ అవి ఎంగేజ్మెంట్ ఫొటోస్ కాదు పెళ్లిచూపుల ఫొటోస్ అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

డైరెక్టర్ సుకుమార్ శిష్యులలో కార్తీక్ వర్మ దండు కూడా ఒకరు.. ఈయన మొదట కొన్ని సినిమాలకు రైటర్ గా పని చేశారు.అలా చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన కార్తికేయ మూవీకి రైటర్ గా కూడా పని చేశారు. మొదటిసారి దర్శకుడిగా టాలీవుడ్లోకి భమ్ బోలేనాథ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కానీ మొదటి సినిమా దెబ్బ కొట్టినప్పటికీ రెండో సినిమా విరూపాక్ష మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో ఈ డైరెక్టర్ పేరు టాలీవుడ్ లో వైరల్ గా మారింది. విరూపాక్ష సినిమా తర్వాత కార్తీక్ వర్మ దండు అక్కినేని నాగచైతన్యతో పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేస్తున్నారు. NC24 అనే వర్కింగ్ టైటిల్ వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Tags:    

Similar News