బాలయ్యకు భయపడుతున్న కార్తి
పేరుకు తమిళ హీరోనే కానీ.. కార్తికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ‘ఆవారా’తో మొదలుకుని ఇక్కడ బాగానే హిట్లు ఇచ్చాడు.;
పేరుకు తమిళ హీరోనే కానీ.. కార్తికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ‘ఆవారా’తో మొదలుకుని ఇక్కడ బాగానే హిట్లు ఇచ్చాడు. ఈ మధ్య అన్న సూర్య లాగే ఇక్కడ అతడి జోరు కూడా తగ్గింది. ఇప్పుడు కార్తి ఆశలన్నీ ‘వా వాతియార్’ మీదే ఉన్నాయి. ఇది డెబ్యూలోనే ‘సూదు కవ్వుం’ లాంటి కల్ట్ మూవీ ఇచ్చిన నలన్ కుమారస్వామి డైరెక్ట్ చేసిన చిత్రం. కొన్ని కారణాల వల్ల ఈ మూవీ చాాలా ఆలస్యం అయింది. చాలా టైం తీసుకున్నా కూడా ఇప్పటికీ సినిమా రెడీ కాలేదు. కానీ డిసెంబరు 5న ‘వా వాతియార్’ను రిలీజ్ చేయడం కోసం ఇప్పుడు టీం హడావుడి పడుతోంది. బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయడానికి కష్టపడుతోంది. తమిళంలో ఆ డేట్‌కే సినిమాను రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు.
బాలయ్య సినిమా అఖండ-2 పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నప్పటికీ.. తమిళంలో ఈ చిత్రానికి ఇబ్బంది లేకపోవచ్చు. ఇతర భాషా చిత్రాలకు అక్కడ థియేటర్లు ఇవ్వరు, ప్రేక్షకుల ప్రోత్సాహమూ తక్కువే. కాబట్టి తమిళంలో ‘వా వాతియార్’ చెప్పిన డేట్‌కే వచ్చేలా ఉంది. కానీ తెలుగులో మాత్రం ఆ అవకాశం కనిపించడం లేదు. ‘అన్నగారు వస్తారు’ అంటూ ఈ సినిమా కొత్త టైటిల్‌ను అనౌన్స్ చేసిన టీం.. డిసెంబరు రిలీజ్ అని మాత్రమే ప్రకటించింది. డేట్ ఇవ్వలేదు.
డిసెంబరు 5నే తెలుగులో కూడా రిలీజ్ చేస్తే ‘అఖండ-2’ తుపాను ముందు కార్తి మూవీ నిలవడం కష్టమవుతుంది. అందుకే సినిమాను ఒకట్రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. కానీ ఎప్పుడూ తమిళంతో పాటే కార్తి సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చి.. దీన్ని మాత్రం ఆలస్యం చేస్తే అంత బాగోదు. పైగా అప్పటికే టాక్ బయటికి వచ్చేసి ఉంటుంది, కథేంటో తెలిసిపోతుంది కాబట్టి నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలా అని బాలయ్య సినిమాకు ఎదురు వెళ్లనూ లేరు. తెలుగు మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తమిళంలోనూ సినిమాను వాయిదా వేసి రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయడం ఉత్తమం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.