డైరెక్టర్ కోసం హీరో వెయిటింగ్ !
అన్నీ అనుకున్నట్లు జరిగితే `ఎల్ సీ యూ `నుంచి `ఖైదీ 2` ఇప్పటికే మొదలవ్వాలి. కానీ కార్తీ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండగా, లొకేష్ కనగరాజ్ తన పనుల్లో తాను బిజీగా ఉన్నాడు.;
అన్నీ అనుకున్నట్లు జరిగితే `ఎల్ సీ యూ `నుంచి `ఖైదీ 2` ఇప్పటికే మొదలవ్వాలి. కానీ కార్తీ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండగా, లొకేష్ కనగరాజ్ తన పనుల్లో తాను బిజీగా ఉన్నాడు. మరి ఈ డిలేకి కారణం ఏంటి? అంటే? కొన్నాళ్ల పాటు డైరెక్షన్ పక్కన బెట్టి హీరోగా లక్ చెక్ చేసుకోవడమే. `కూలీ` రిలీజ్ అనంతరం లోకేష్ కనగరాజ్ హీరోగా మ్యాకప్ వేసుకున్న సంగతి తెలిసిందే. అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. లోకేష్ మార్క్ క్రైమ్ థ్రిల్లర్ కావడం..హీరో ఛాన్స్ అనే సరికి లోకేష్ కూడా వెయిటింగ్ ఎందుకునుకున్నాడో? ఏమో గానీ మారు మాట్లాడకుండా పట్టాలెక్కించాడు ప్రాజెక్ట్.
డిసెంబర్ లో రెండు రిలీజ్ లతో:
`డీసీ` అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకూ రిలీజ్ కాదు. మరి `ఖైదీ2` మొదలయ్యేది ఎప్పుడు? అంటే రిలీజ్ తర్వాతేనని తెలుస్తోంది. దీంతో లోకేష్ కోసం కార్తీ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం కార్తీ హీరోగా `మార్షల్` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తప్ప మరే సినిమా షూటింగ్ దశలో లేదు. కార్తీ నటించిన `వా వాతయార్` ఇప్పటికే రిలీజ్ కు రెడీ గా ఉంది. డిసెంబర్ లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీ నటిస్తోన్న మరో చిత్రం `సర్దార్ `2 కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.
కార్తీకి ఇదో కొత్త ఎక్స్ పీరియన్స్:
ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించి కార్తీ కేవలం ప్రచార కార్యక్రమాల్లో మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. ఆ రెండు రిలీజ్ అయితే వాటి నుంచి పూర్తిగా రిలీవ్ అవుతాడు. `మార్షల్` కూడా మరో రెండు..మూడు నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఆ తర్వాత `ఖైదీ 2` మొదలయ్యే వరకూ కార్తీకి వెయిటింగ్ తప్పదు. ఆ వెయిటింగ్ లోకేష్ వల్లే. ఇలా డైరెక్టర్ కోసం హీరో వెయిట్ చేయడం అన్నది కార్తీ అనుభవంలో ఇదే తొలిసారి కావొచ్చు.
కొత్త కథలు వినే ఛాన్సుంది:
సాధారణంగా హీరోల కోసం డైరెక్టర్లు వెయిట్ చేస్తుంటారు. కానీ లోకేష్-కార్తీ మధ్య సన్నివేశం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. మరి ఈ గ్యాప్ లో కార్తీ ఏం చేస్తాడు? అంటే కొత్త కథలు వినడానికి అవకాశం ఉంది. `మార్షల్` కూడా నత్తనడకన షూటింగ్ జరుతుంది. దీంతో కార్తీ కి సమయం ఎక్కువగానే దొరుకుతుంది. షూటింగ్ ఉంటే చేయడం లేదంటే కథలు వినడంపైనే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.