మూడేళ్ల నిరీక్షణ..రీ-ఎడిటింగ్ మాయాజాలం!

తాజాగా ఆలస్యం వెనుక ఉన్న అంతర్గత కారణాలను సిరీస్ రచయిత మయూఖ్ ఘోష్ వెల్లడించారు. కంటెంట్ అనుకున్న సమయానికి రాకపోవడానికి పరిశ్రమలో రకరకాల కారణాలుంటాయ‌న్నారు.

Update: 2026-06-14 08:28 GMT

డిజిటల్ విప్లవం తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వెబ్ సిరీస్‌ల హవా విపరీతంగా పెరిగింది. అయితే కొన్ని ప్రాజెక్టులు షూటింగ్ .. నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రేక్షకులను చేరుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ ప్రధాన పాత్రలో అభినయ్ దేవ్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ `బ్రౌన్` కూడా ఇదే తరహా నిరీక్షణను ఎదుర్కొంది. దాదాపు మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ విడుదలకు నోచుకోలేదు. తాజాగా ఆలస్యం వెనుక ఉన్న అంతర్గత కారణాలను సిరీస్ రచయిత మయూఖ్ ఘోష్ వెల్లడించారు. కంటెంట్ అనుకున్న సమయానికి రాకపోవడానికి పరిశ్రమలో రకరకాల కారణాలుంటాయ‌న్నారు.

`బ్రౌన్` సిరీస్ విషయంలో కూడా లం సాంకేతిక సమస్యలు మాత్రమే కాదు. అవుట్‌పుట్‌పై మరింత పట్టు సాధించేందుకు తీసుకున్న సమయమే ఈ మూడేళ్ల ఆలస్యానికి ప్రధాన కార‌ణ‌మ‌న్నారు. అలాగే ఎడిటింగ్ టేబుల్‌పై కథనం వేగాన్ని, ఉత్కంఠను మరింత పెంచడానికి కొన్నిసార్లు సీన్ల క్రమాన్ని పూర్తిగా మార్చాల్సి వస్తుంది. `బ్రౌన్` విషయంలో కూడా ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా కథలోని సస్పెన్స్ ఎలిమెంట్స్ .. క్రైమ్ డ్రామా మరింత పవర్‌ఫుల్‌గా పండేలా చేయడం కోసమే రీ-ఎడిటింగ్ ప్రక్రియను చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

కరిష్మా కపూర్ విభిన్నమైన డార్క్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్న ఈ క్రైమ్ డ్రామా సిరీస్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టింది. ఈ ఆలస్యం మధ్యలో సిరీస్‌ను పూర్తిగా రీ-ఎడిట్ చేసినట్లు రచయిత మయూఖ్ ఘోష్ స్పష్టం చేశారు. ఒక కథను పేపర్‌పై రాసినప్పుడు ఉన్న ఫీల్, కెమెరా ముందుకొచ్చాక మారే అవకాశం ఉంది.

దర్శకుడు అభినయ్ దేవ్ గత చిత్రాలైన `ఢిల్లీ బెల్లీ`, `బ్లాక్‌మెయిల్` వంటి ప్రాజెక్టులతో విభిన్నమైన డార్క్ కామెడీ, థ్రిల్లర్ శైలిని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

`బ్రౌన్` సిరీస్ లో కూడా అదే తరహా విలక్షణమైన ముద్రను చూపించబోతున్నారు. ఒక వెబ్ సిరీస్ కు ఎడిటింగ్ అనేది ప్రాణవాయువు లాంటిది. అందువల్ల కథలోని ఎమోషనల్ గ్రాఫ్‌ను పక్కాగా బ్యాలెన్స్ చేయడానికి ఎడిటింగ్ లో కీలక మార్పులు చేయడం వల్ల కథనం మరింత వేగవంతంగా మారిందని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ మార్పులు సిరీస్ నాణ్యతను పెంచాయని రచయిత విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రస్తుత డిజిటల్ మార్కెట్‌లో ప్రేక్షకుల అభిరుచులు చాలా వేగంగా మారిపోతున్నాయి. మూడేళ్ల క్రితం ఉన్న ట్రెండ్‌కు ఇప్పటి మేకింగ్ స్టైల్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ ఆలస్యమై ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు అది అవుట్‌డేటెడ్‌గా అనిపించే ప్రమాదం ఉంటుంది. కానీ `బ్రౌన్` విషయంలో మేకర్స్ చేసిన రీ-ఎడిటింగ్ వల్ల సిరీస్ ప్రస్తుత కాలపు ఓటీటీ ట్రెండ్స్ .. ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగా సరికొత్తగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆలస్యమైనా పర్‌ఫెక్ట్ ప్రొడక్ట్‌ను ఇవ్వాలనే మేకర్స్ పట్టుదల కనిపిస్తోంది.

Tags:    

Similar News