కరణ్ బక్కగా అవ్వడానికి షాకింగ్ కారణం?
అయితే బరువు తగ్గడానికి ప్రధానంగా రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తున్నట్టు తెలిపాడు. కఠినమైన ఆహార ప్రణాళిక ఈ మార్పునకు కారణమని కరణ్ స్పష్టం చేశారు.;
ఇటీవల బాగా బక్క చిక్కి పాలిపోయి జీవం లేనివాడిలా కనిపించాడు కరణ్ జోహార్. ఎంతో ఆరోగ్యంగా, స్టైలిష్ గా ఫ్యాషనిస్టాలా ఉండే కరణ్ ఉన్నట్టుండి ఇలా అయిపోవడం చాలా మందిని కంగారు పెట్టింది. ముఖ్యంగా అతడు తన శత్రువులకు మరో అవకాశం కల్పించాడు. డ్రగ్స్ సేవనం మితిమీరడంతోనే ఇలా అయ్యాడని కామెంట్లు వినిపించాయి.
అయితే ఉన్నట్టుండి ఇలా తీవ్రంగా బరువు తగ్గడం వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు కరణ్ స్వయంగా రివీల్ చేసాడు. రక్త స్థాయిలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని దానికోసమే ఇదంతా ప్రారంభమైందని ఆయన అన్నారు. రక్తం పునరుద్ధకణ కోసం మందులు తీసుకుంటున్నాడు.
అయితే బరువు తగ్గడానికి ప్రధానంగా రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తున్నట్టు తెలిపాడు. కఠినమైన ఆహార ప్రణాళిక ఈ మార్పునకు కారణమని కరణ్ స్పష్టం చేశారు. తినడం తగ్గించడమే కాదు.. ఈత, పాడిల్‌బాల్‌ను కూడా తన దినచర్యలో చేర్చుకున్నాడు. తన శారీరక మార్పులు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకే ఈ ప్రయత్నం. కానీ తనను చూసి బక్క చిక్కకుండా, అభిమానులను జాగ్రత్తగా తినమని ప్రోత్సహించారు.
అంతకుముందు ఐఫా అవార్డులలో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఇదంతా ఆరోగ్యంగా ఉండేందుకేనని అన్నాడు. బాగా తినడం, వ్యాయామం చేయడం, అందంగా కనిపించడానికి మీ వంతు కృషి చేయాలని అన్నాడు. కానీ ఇప్పుడు కరణ్ అందుకు భిన్నంగా మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
గత సంవత్సరం కరణ్ జోహార్ ఓజెంపిక్ ఉపయోగిస్తున్నాడని ఎక్స్ ఖాతాలో ఆరోపించిన ఒక వినియోగదారుకు కరణ్ కౌంటర్ ఇచ్చాడు. నెటిజనుడి కామెంట్ కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసి, ఆ ఆరోపణను తోసిపుచ్చారు. తన బరువు తగ్గడం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ఫలితమని అన్నాడు.