సంచలన ప్రాంచైజీలో నేషనల్ క్రష్!
విక్రాంత్ మాస్సే కథానాయకుడిగా కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా దోస్తానా 2 ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో ఇది ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా హైలైట్ అవుతుంది.;
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలే అమ్మడి కోసం వెయిట్ చేస్తున్నారాంటే? నార్త్ లో అమ్మడి డిమాండ్ ఎలా ఉందో అద్దం పడుతుంది. రష్మిక కూడా ఎక్కడా కంగారు పడకుండా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇవాళ్లి నిర్ణయాలే రేపటి భవిష్యత్ గా భావించి సరైన కథలు అయితేనే కమిట్ అవుతుంది. లేదంటే నిర్మొహమాటంగా నో చెబుతుంది. తాను పారితోషికం కోసం పనిచేసే నటిని కాదని నిర్మాతలకు తెలివిగా సంకేతాలు పంపిస్తుంది. తాను ఏ సినిమా కమిట్ అయినా అందులో తప్పని సరిగా స్టార్లు కూడా యాడ్ అయ్యేలా చూసుకుంటుంది.
బాలీవుడ్ స్పెషల్ మూవీ:
ప్రస్తుతం `తామ్మా`, `కాక్ టెయిల్ 2 షూటింగ్ లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన ప్రాంచైజీ `దోస్తానా ` లో హీరోయిన్ గా అమ్మడికి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. విక్రాంత్ మాస్సే కథానాయకుడిగా కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా దోస్తానా 2 ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో ఇది ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా హైలైట్ అవుతుంది. తొలుత ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ ని హీరోగా తీసుకుని అటుపై అతడిని తప్పించి విక్రాంత్ కు అవకాశం ఇచ్చారు. కార్తీక్ ని అనూహ్యంగా కరణ్ తప్పించడం అప్పట్లో పెద్ద సంచలనంగానే మారింది.
నిర్మాతను గడువు కోరిన నటి:
దీంతో మరోసారి నెపోటిజం అంశం చర్చకొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో విక్రాంత్ ఈ ప్రాజెక్ట్ కు హీరోగా ఎంపికయ్యాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇందులో హీరోయిన్ కోసం రకరకాల పేర్లు పరిశీలించారు కరణ్ అండ్ కో. కానీ ఎవ్వర్నీ ఇంత వరకూ ఫైనల్ చేయలేదు. తాజాగా రష్మిక మందన్నానను కరణ్ అప్రోచ్ అయి విషయం చెప్పినట్లు..అందుకు రష్మిక కూడా సానుకూలంగా స్పందించినట్లు ఆమె సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. తుది నిర్ణయం చెప్పడానికి మాత్రం కొంత గడువు కావాలని కోరిందిట. అందుకు కరణ్ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం.
ఛాన్స్ వదులుకునే అవకాశం లేదు:
ట్రెండింగ్ లో ఉన్న నటీనటుల్ని టార్గెట్ చేయడం కరణ్ ప్రత్యేకత. అందుకోసం ఎలాంటి వ్యూహాలైనా వేసి తన దారికి తెచ్చుకోవడంలో కరణ్ స్పెషలిస్ట్. అయితే తెలుగు దర్శకుల విషయంలో ఆయన స్ట్రాటజీ వర్కౌట్ అవ్వ లేదు. ప్రస్తుతం రష్మిక కూడా సీరియస్ గా బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టడంతో `దొస్తానా 2` కి ఎలాంటి అడ్డకులు చెప్పే అవకాశం లేదు. 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన `దోస్తానా`కి సీక్వెల్ కాబట్టి క్రేజీ ప్రాజెక్ట్ ను వదులుకోదని అభిమానులు భావిస్తున్నారు.