కన్యాకుమారి ట్రైలర్‌: మనసును హత్తుకునేలా!!

సృజన్ అట్టాడ దర్శకత్వం వహిస్తూ.. అదే సమయంలో ప్రొడ్యూస్ చేస్తున్న ఆ సినిమాలో గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.;

Update: 2025-08-21 05:44 GMT

ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌ గా రూపొందుతున్న గ్రామీణ ప్రేమ కథా చిత్రం కన్యాకుమారి. ఆర్గానిక్ ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్. సృజన్ అట్టాడ దర్శకత్వం వహిస్తూ.. అదే సమయంలో ప్రొడ్యూస్ చేస్తున్న ఆ సినిమాలో గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.


రెండు వేర్వేరు ప్రపంచాలు! ఒకే దారిలో నడవాలని నిర్ణయించుకున్నాయంటూ రాసుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో కన్యాకుమారి మూవీ ట్రైలర్ ఫుల్ వైరల్ గా మారింది. సినీ ప్రియులను తెగ ఆకర్షిస్తోంది. సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ చాలా బాగుందని నెటిజన్లు చెబుతున్నారు.

గ్రామీణ ప్రేమను కొత్తగా కన్యాకుమారి మూవీ ప్రజెంట్ చేసినట్లు కనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. గీత్ సైనీ, శ్రీచరణ్ కెమిస్ట్రీ చాలా బాగుందని అంటున్నారు. ఓవరాల్ గా ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉందని చెబుతున్నారు. మనసును హత్తుకునేలా ఉన్న కన్యాకుమారి టీజర్ వల్ల సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయంటున్నారు.

అయితే ట్రైలర్ విషయానికొస్తే.. హీరోయిన్ ను కన్యాకుమారిగా పరిచయం చేస్తారు మేకర్స్. ఆమె చిన్నప్పటి నుండి సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ కావాలని కోరుకుంటుంది. కానీ చివరికి బట్టల షోరూమ్‌ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ గా మారుతుంది. అదే సమయంలో రైతుగా స్థిరపడాలనుకునే ఒక అబ్బాయితో కన్యాకుమారి ప్రేమలో పడుతుంది.

ఇద్దరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. విభిన్న ఆశయాలు, కుటుంబ వ్యతిరేకత మధ్య ఇద్దరి ప్రేమ కథే సినిమా అని క్లియర్ గా తెలుస్తోంది. రచన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు వహించిన సృజన్ అట్టాడ.. గ్రామీణ ప్రేమకథను కొత్త రీతిలో ప్రజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సహజమైన కథనంతో సినిమా తీసినట్లు అర్థమవుతుంది.

శివ గాజుల, హరిచరణ్ తీసిన అద్భుతమైన దృశ్యాలతోపాటు రవి నిడమర్తి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఆకర్షణీయమైన ప్రేమ కథకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోల్ ను జోడిస్తుందని చెప్పాలి. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ యాక్టింగ్ అట్రాక్టివ్ గా ఉంది. ట్రైలర్ లో హీరోయిన్ చెప్పిన డైలాగ్స్ కామెడీగా ఉన్నా.. డెప్త్ తో ఉన్నాయని చెప్పాలి. మరి ఆగస్టు 27న విడుదలవనున్న కన్యాకుమారి చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News