కాంతార ప్రీక్వెల్.. నార్త్ లో గొడవేంటి?

కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో కాంతార: చాప్టర్ 1 రూపొందుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-09-27 19:30 GMT

కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో కాంతార: చాప్టర్ 1 రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ కాంతార ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాకు రిషబ్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నారు.

రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ మూవీ.. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా విడుదల అవ్వనున్న కాంతార ప్రీక్వెల్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు.

టైమ్ దగ్గరపడుతుండటంతో రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ అవుతోంది. నార్త్ లో కాంతార రిలీజ్ అవ్వనున్న థియేటర్స్ విషయంలో వివాదం నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఆ సంగతి హాట్ టాపిక్ గా మారింది.

కాంతార ప్రీక్వెల్ రిలీజ్ అవుతున్న రోజే.. బాలీవుడ్ లో సన్నీ సంస్కారి కి తులసి కుమారి మూవీ విడుదల కానుంది. దీంతో తమ సినిమా రిలీజ్ అయ్యే సింగిల్, డబుల్, ట్రిపుల్ స్క్రీన్ థియేటర్లలో కేవలం తమ సినిమాను మాత్రమే ప్రదర్శించాలని మేకర్స్ డిమాండ్ చేస్తున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

సన్నీ సంస్కారి కి తులసి కుమారితో షోలను షేర్ చేయొద్దని అడుగుతున్నట్లు వార్తలు రాగా.. అనేక మంది నార్త్ నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెబుతున్నారు. థియేటర్స్ ను షేర్ చేసుకోవాలని.. ఇలా సరికాదని అంటున్నారు. 100 శాతం స్క్రీన్స్ కావాలంటే ఎలా అని క్వశన్స్ చేస్తున్నారు.

షేర్ చేసుకుంటే.. హెల్దీ పోటీ ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు పాన్ ఇండియా మూవీతో పోటీ ఎందుకు.. సన్నీ సంస్కారి కి మేకర్స్ కు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. మరో డేట్ ను ఎంచుకోవాలని అంటున్నారు. అయితే కాంతార మేకర్స్ డిమాండ్ నిజమో లేదో తెలియకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి అందులో నిజమెంతో చూడాలి.

Tags:    

Similar News