కాంతార చాప్టర్ 1.. నెవ్వర్ బిఫోర్ రికార్డు

బాలీవుడ్ తోపాటు ఓవర్సీస్ లో అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తోంది. ఇక కర్ణాటకలో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. రిలీజై 18 రోజులు అవుతున్నా.. హై నంబర్స్ నమోదు అవుతున్నాయి.;

Update: 2025-10-19 11:49 GMT

బ్లాక్ బస్టర్ హిట్ కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రూపొందిన కాంతార చాప్టర్ 1 రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా.. ఆడియన్స్ అంచనాలను అందుకుని దూసుకుపోతోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల కురిపిస్తోంది.

వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ.700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన కాంతార ప్రీక్వెల్.. తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్ తోపాటు ఓవర్సీస్ లో అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తోంది. ఇక కర్ణాటకలో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. రిలీజై 18 రోజులు అవుతున్నా.. హై నంబర్స్ నమోదు అవుతున్నాయి.

ఇప్పటి వరకు కర్ణాటకలో కాంతార చాప్టర్ 1 రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ రాష్ట్రంలో రూ.200 కోట్లు రాబట్టిన తొలి మూవీగా నిలిచింది. థియేటర్స్ లో రిలీజ్ అయిన మూడు వారాల్లో ఆ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అయితే కన్నడ సినీ ఇండస్టీ ఖ్యాతిని పాన్ ఇండియా రేంజ్ లో చాటి చెప్పిన కేజీఎఫ్ -2 కూడా ఆ రికార్డు క్రియేట్ చేయకపోవడం గమనార్హం.

నిజానికి.. కేజీఎఫ్ -2 మూవీ థియేట్రికల్ రన్ లో రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసింది. కానీ కర్ణాటకలో మాత్రం అప్పుడు రూ.200 కోట్లు వసూలు చేయలేకపోయింది. రూ.183 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ మాత్రం ఆ ఫీట్ అందుకుని సత్తా చాటింది. అదే సమయంలో నార్త్ లో ఎక్కువ వసూళ్లు సాధించిన కన్నడ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఇప్పటి వరకు ఆ లిస్ట్ లో కేజీఎఫ్ -2 మూవీ టాప్ లో ఉంది. ఫుల్ రన్ లో రూ.435 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ రూ.103 కోట్లు సాధించింది. బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో రెండో స్థానం సంపాదించుకుంది. అయితే ఆ లిస్ట్ లో కాంతార, కేజీఎఫ్, విక్రాంత్ రోణ, 777 చార్లీ, కబ్జా సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఎంత రాబట్టాయంటే..

1.కేజీఎఫ్ -2 - రూ.435 కోట్లు

2. కాంతార చాప్టర్ 1 - రూ.103 కోట్లు

3. కాంతార - రూ.84 కోట్లు

4. కేజీఎఫ్ - రూ.45 కోట్లు

5. విక్రాంత్ రోణ - రూ.12 కోట్లు

6. 777 చార్లీ - రూ.7 కోట్లు

7. కబ్జా - రూ.4 కోట్లు

అయితే ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరిన్ని భారీ సినిమాలు రూపొందుతున్నాయి. అందులో స్టార్ హీరో యశ్ టాక్సిక్ సహా వివిధ పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలన్నీ నార్త్ లో ఎంతటి వసూళ్లు సాధిస్తాయో.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News