అందుకే ఎక్కువ మంది హీరోలతో వర్క్ చేయలేదు
ఎప్పుడూ ఏవొక వ్యాఖ్యలు చేస్తూ తన ముక్కుసూటితనంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇప్పుడు మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు.;
ఎప్పుడూ ఏవొక వ్యాఖ్యలు చేస్తూ తన ముక్కుసూటితనంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇప్పుడు మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. గ్యాంగ్‌స్టర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కంగనా పలు సినిమాలు చేసి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కంగనా తాను పడిన కష్టాలను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
హీరోలకు మర్యాద తెలియదు
బాలీవుడ్ లోని చాలా మంది మేల్ యాక్టర్స్ కు మర్యాద లేదని, ఇండస్ట్రీ మొత్తం చాలా డర్టీగా, పాడైపోయి ఉందని, ఇక్కడ బయట వ్యక్తులపై కనీస దయ కూడా ఉండదని కంగనా పేర్కొన్నారు. తన విషయంలో కూడా ఇవన్నీ జరిగాయని, ఇండస్ట్రీలో గుర్తింపు పొందడానికి ఓ అవుట్ సైడర్ గా తానెన్ని కష్టాలు పడ్డారో కంగనా వెల్లడించారు. ఇండస్ట్రీలోని చాలా మంది మేల్ యాక్టర్స్ ను మర్యాద తెలియని వాళ్లని, అయినప్పటికీ తాను వాళ్లను పట్టించుకోలేదని కంగనా తెలిపారు.
ఇంటర్వ్యూలో భాగంగా ఎప్పుడైనా మేల్ యాక్టర్ల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని అడగ్గా అసలు తాను ఎక్కువ మంది హీరోలతో కలిసి వర్క్ చేయలేదని, వాళ్లు అంత మర్యాదగా ఉండరనేది తన ప్రధాన ఆందోళనగా తెలిపారు. తాను లైంగికంగా అలా అనడం లేదని, సెట్స్ కు లేట్ గా రావడం, తనతో హార్ష్ గా ప్రవర్తించడం, తనను పక్కన పెట్టేయడం, చిన్న కారవ్యాన్ ఇవ్వడం లాంటివి చేస్తుంటారని ఆమె అన్నారు.
వారు చేసిన వాటికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎంతోమంది తనపై కేసులు కూడా పెట్టారని కంగనా అన్నారు. ఇండస్ట్రీలోని చాలా మంది అమ్మాయిలు వాటన్నింటికీ ఓకే అన్నప్పటికీ ఆమెకు మాత్రమే ఎందుకింత అహంకారం అని వాళ్లు అనుకున్నారని కంగనా తెలిపారు. మీటూ క్యాంపైనింగ్ టైమ్ లో కూడా తాను దాని గురించి ఓపెన్ గా మాట్లాడానని, కాస్టింగ్ కౌచ్ వల్ల చాలా మంది మహిళా నటులు ఇబ్బంది పడుతున్నారని కంగనా చెప్పారు.