అప్పుడు సలార్.. ఇప్పుడు కన్నప్ప.. విష్ణు ధైర్యమిదే!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మైథలాజికల్ జోనర్ లో రూపొందిన ఆ సినిమా.. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. రూ.50 కోట్ల క్లబ్ లో రీసెంట్ గా కన్నప్ప మూవీ చేరినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే కన్నప్ప మూవీని ఒక్క రూపాయి అడ్వాన్స్ తీసుకోకుండా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో రిలీజ్ చేశారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సూపర్ హిట్ మూవీ సలార్ విషయంలో అదే జరిగింది. ముందు అడ్వాన్స్ తీసుకున్నా.. ఆ తర్వాత దానిని రిటర్న్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ ఫీట్ ను కన్నప్ప మేకర్స్ రిపీట్ చేశారు.
అదే సమయంలో కన్నప్ప రిలీజ్ కు మూడు రోజుల ముందే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ను విష్ణు క్లియర్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ రెండు విషయాలు ఎలా సాధ్యమయ్యాయనే ప్రశ్నకు మీడియా చిట్ చాట్ లో విష్ణు రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో, చెప్పిన మాటలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
"నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ బ్యాంక్ లో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం. ప్రతి రూపాయి కూడా అదే. జీవితంలో ఓ సమయం వస్తుంది. ఉన్న కాయిన్స్ ముందు పెట్టి.. హెడ్స్ ఆర్ టైల్స్.. హెడ్స్ అయితే గెలుస్తాం.. టైల్స్ అయితే ఓడిపోతాం.. కన్నప్పకు నా పరిస్థితి అదే. దేవుడి దయ.. కేవలం శివ లీల వల్ల గెలిచాను" అని విష్ణు తెలిపారు.
తాను ఇంకా అది నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. సినిమాను నిజాయితీగా తీస్తే ఆడియన్స్ ఆదరిస్తారు అనడానికి కన్నప్ప ఒక నిదర్శనమని తెలిపారు. సినిమా విజయం ఆడియన్స్ దేనని అన్నారు. అయితే రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.
కాగా, సినిమా విషయానికొస్తే.. విష్ణు లీడ్ రోల్ లో కనిపించారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించారు. మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ లో సందడి చేశారు. వారితో పాటు శరత్ కుమార్, శివ బాలాజీ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, మధుబాల, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య భాస్కరన్ సహా అనేక మంది నటీనటులు యాక్ట్ చేశారు. మంచి హిట్ ను కూడా అందుకున్నారు.