• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ సినిమాలకు బీజేపీ సెగ

కమల్ సినిమాలకు బీజేపీ సెగ

| ఇప్పుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కారణంగా ఆయన సినిమాలను హిందువులు చూడడం మానేయాలని బీజేపీ పిలుపునిచ్చింది!

By - M Prashanth
Update: 2025-08-06 07:26 GMT

ప్రముఖ హీరో కమల్ హాసన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారుతుంటారు. దీంతో తరచూ వివాదాలు రేగుతుంటాయి. రీసెంట్ గా తన మూవీ థగ్ లైఫ్ సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఏకంగా కర్ణాటకలో ఆ సినిమా రిలీజ్ కూడా కాకుండా అయిపోయింది.

ఇప్పుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కారణంగా ఆయన సినిమాలను హిందువులు చూడడం మానేయాలని బీజేపీ పిలుపునిచ్చింది! కమల్ చిత్రాలను బాయ్ కాట్ చేయాలని తమిళనాడు బీజేపీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సెక్రటరీ అమర్ ప్రసాద్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"అప్పుడు ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు కమల్ హాసన్.. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వీరికి తగిన గుణపాఠం చెప్పాలి. హిందువులు అందరూ కూడా కమల్ సినిమాలను బాయ్‌ కాట్ చేయాలి. ఓటీటీలో కూడా చూడకూడదు. అప్పుడే సనాతన ధర్మంపై పిచ్చి కామెంట్లు చేయడానికి భయపడతారు" అని అన్నారు.

అయితే రీసెంట్ గా సినీ నటుడు సూర్య ఎడ్యుకేషన్ చారిటీ అయిన అగరం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కమల్, పలు వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వాన్ని, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్య అని కమల్ అన్నారు. ప్రజలు మరే ఆయుధాన్ని చేతిలోకి తీసుకోకుండా కేవలం విద్యను మాత్రమే గట్టిగా పట్టుకోవాలని తెలిపారు.

దీంతో బీజేపీ సెక్రటరీ అమర్ ప్రసాద్ రెడ్డి వీడియో రిలీజ్ చేస్తూ సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతానికి విడుదలకు ఆయన వద్ద ఏ ప్రాజెక్ట్ సిద్ధంగా లేదు. కానీ మరికొద్ది రోజుల్లో భారతీయుడు-3 విడుదల కానుంది. త్వరలో మిగిలిన షూటింగ్ పార్ట్ ను మేకర్స్ కంప్లీట్ చేయనున్నారు.

దీంతో ఆ సినిమాకు బాయ్ కాట్ సెగ తగిలే అవకాశం ఉంది. అయితే ఆయన లీడ్ రోల్ లో నటించిన చివరి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. శంకర్ దర్శకత్వంలో నటించిన భారతీయుడు 2 డిజాస్టర్ గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో చేసిన థగ్ లైఫ్ తేలిపోయింది. రెండు సినిమాలు కూడా మేకర్స్ కు భారీ నష్టాలు మిగిల్చాయి.

Tags:    
  • KamalHaasan 
  • SanatanaDharmaControversy 
  • BJPVsKamal 
  • BoycottBollywood 
  • HinduSentiments 
  • ThugLife 
  • Indian3 
  • BJPProtest 
  • AgaramFoundation 
  • బాయ్‌కాట్‌కమల్ 
  • సనాతనధర్మం 
  • భారతీయుడు3 
  • థగ్‌లైఫ్ 
  • బీజేపీ 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS