ఆ బ్యూటీకి విజయ్ సేతుపతి స్పూర్తి!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అనతి కాలంలోనే స్టార్ లీగ్ లో చేరాడంటే? అది ట్యాలెంట్ తో మాత్రమే సాధ్యమైంది. తన అసాధారణ నటనతోనే విమర్శకుల ప్రశంసలందుకున్నాడు;
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అనతి కాలంలోనే స్టార్ లీగ్ లో చేరాడంటే? అది ట్యాలెంట్ తో మాత్రమే సాధ్యమైంది. తన అసాధారణ నటనతోనే విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. తమిళ నటుడైనా? దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడంటే? కేవలం తన నటనతోనే సాధ్యమైంది. భవిష్యత్ లో కమల్ హాసన్ లా పరిశ్రమలో ఎదుగుతాడని అంచనాలు భారీగా ఉన్నాయి. ఎంతో మంది స్టార్ హీరోలున్నా? వాళ్లందరికంటే తాను ప్రత్యేకమనే విషయాన్ని తన పాత్రల ద్వారా చెప్పకనే చెబుతున్నాడు.
రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా:
అయితే విజయ్ సేతుపతిని `పొలిమేర` ఫేం కామాక్షి భాస్కర్ల స్పూర్తిగా తీసుకుని రాణిస్తుందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని తానే స్వయంగా రివీల్ చేసింది. విజయ్ సేతుపతితో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా తనకు స్పూర్తిగా నిలిచారంది. విజయ్ సేతు పతిలాగే శ్రీవిష్ణు, సుహాస్ కూడా డిఫరెంట్ ప్రయత్నాలు చేస్తున్నారంది. హీరోయిన్లు కూడా అలా ఎందుకు చేయకూడదని తాను కూడా సవాల్ గా తీసుకు న్నట్లు తెలిపింది. విభిన్న రకాల పాత్రలు పోషించే ప్రయత్నం చేస్తున్నానంది. కెరీర్ ఆరంభం నుంచి తన ఆలోచనలు రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటాయంది.
పొలిమేరతో అమ్మడు ఫేమస్:
`పొలిమేర`, `విరూపాక్ష` చిత్రాలు తనకు మంచి పేరు తీసుకురావడానికి కారణంగా అందులో పాత్రలు సహా కథ కారణంగానే సాధ్యమైందని తెలిపింది. ప్రస్తుతం తాను నటిస్తోన్న `12 ఏ రైల్వే కాలనీ` లో పాత్ర కూడా రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని పేర్కొంది. ఇదో మంచి ప్రేమ కథతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమని తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు, అమ్మడు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తోంది. హిట్ ప్రాంచైజీ పొలిమేర నుంచి `పొలిమేర 3` కూడా రెడీ అవుతోంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.
మూడు సినిమాలతో బిజీ:
రెండు భాగాలు భారీ విజయం సాధించడంతో మూడవ భాగాన్ని ఏకంగా పాన్ ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే `మాన్షన్ మౌస్ మల్లేష్` అనే మరో సినిమాలు కూడా కామాక్షి నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ బ్యూటీ కూడా డాక్టర్ కాబోయి యాక్టర్ అయింది. కానీ డాక్టర్ గా చదువు పూర్తి చేసింది. కొంత కాలం ఉద్యోగం కూడా చేసింది. ఆ తరువాతనే మోడలింగ్ పట్ల ఆసక్తి అటువైపు టర్న్ తీసుకుంది. అక్కడా గుర్తింపు రావడంతో సినిమాల్లోనూ ప్రయత్నాలు చేసి సక్సస్ అయింది.