అనాధాశ్రమంలో కళ్యాణి ప్రియదర్శన్.. రూమర్స్ పై స్పందించిన హీరోయిన్!

ఇదే చిత్రాన్ని తెలుగులో కొత్తలోక అంటూ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటు తెలుగులో కూడా ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంటుంది ఈ సినిమా.;

Update: 2025-09-23 13:40 GMT

కళ్యాణి ప్రియదర్శన్.. మలయాళ బ్యూటీగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. తాజాగా తొలిసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద లేడీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా చేసి రికార్డు సృష్టించింది. 'లోక చాప్టర్ 1 : చంద్ర'అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి మలయాళ సినీ ఇండస్ట్రీకి మరింత గుర్తింపును అందించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో కొత్తలోక అంటూ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటు తెలుగులో కూడా ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంటుంది ఈ సినిమా.

ముఖ్యంగా అభిమానులు, సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా కళ్యాణి ప్రియదర్శన్ నటనను పొగుడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఈమె ఎన్నో విషయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కళ్యాణిపై ఒక సినీ వెబ్సైట్ పోస్ట్ పెట్టగా.. అది కాస్త వైరల్ అయింది. దీంతో నిజంగానే కళ్యాణి ప్రియదర్శన్ అనాధాశ్రమంలో ఉన్నారా? వారి తల్లిదండ్రులు ఏమయ్యారు? అంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు కాస్త బాగా వ్యాపించడంతో తాజాగా దానిని ఖండించింది కళ్యాణి ప్రియదర్శన్.

కళ్యాణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. "జీవితం అంటే ఏంటో మాకు తెలియాలన్న ఉద్దేశంతోనే మా పేరెంట్స్ నన్ను, నా సోదరుడిని వియత్నాంలోని అనాధాశ్రమంలో వారం పాటు ఉంచారు. అదో గొప్ప అనుభవం.. జీవితాంతం గుర్తుండిపోయే పాఠం " అని నేను చెప్పినట్లుగా సదరు వెబ్సైటు పోస్టు పెట్టింది. "అయితే ఈ మాట నేనెప్పుడూ అనలేదు.. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చెయ్యకండి" అంటూ విజ్ఞప్తి చేసింది. మొత్తానికి అయితే తమ్ముడు తో కలిసి అనాధాశ్రమంలో గడిపింది అంటూ వస్తున్న వార్తలపై స్పందించి చెక్ పెట్టింది కళ్యాణి ప్రియదర్శన్.

కొత్తలోక సినిమా విషయానికి వస్తే.. ఫాంటసీ నేపథ్యంలో లేడీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు ..ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు సుమారుగా రూ.270 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. మలయాళ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమా ఇంకా థియేటర్లలోనే నడుస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా దసరా సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాను ఇంకా థియేటర్లలోనే కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఇప్పట్లో ఓటీటీలోకి రాదు అని నిర్మాత దుల్కర్ సల్మాన్ కూడా క్లారిటీ ఇచ్చారు.

కళ్యాణి ప్రియదర్శన్ విషయానికి వస్తే.. తెలుగులో తొలిసారి హలో సినిమాతో తన నటన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి సినిమాలో మెరిసిన ఈమె అనూహ్యంగా తెలుగు తెరకు దూరమై మలయాళంలోనే సినిమాలు చేస్తూ ఉండిపోయింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కొత్తలోక అంటూ మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Tags:    

Similar News