కల్కి 2.. పని అవ్వాలంటే మాత్రం..?

రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో కల్కి 2898 AD అంటూ ఒక అద్భుతమైన సినిమా చేశాడు టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. వైజయంతి బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ సినిమా వచ్చింది.;

Update: 2025-09-01 09:30 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో కల్కి 2898 AD అంటూ ఒక అద్భుతమైన సినిమా చేశాడు టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. వైజయంతి బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ సినిమా వచ్చింది. ఐతే కల్కి పార్ట్ 2 కూడా ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు. ఐతే సినిమా రిలీజై ఏడాది అయిపోయిన సరే పార్ట్ కి సంబందించిన అప్డేట్ రావట్లేదు. కల్కి 2 ఇదిగో అప్పుడు మొదలవుతుంది.. ఇప్పుడు మొదలవుతుంది అని చెబుతున్నారు తప్ప సెట్స్ మీదకు మాత్రం వెళ్లట్లేదు. మరోపక్క ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు.

స్టార్ కాస్ట్ డేట్స్ అడ్జెస్ట్ చేయాలి..

ప్రభాస్ డేట్స్ తీసుకోవాలి... అతనితో పాటు మిగతా . వాళ్లందరినీ కలిపి కల్కి 2 చేయాలి. ఇది నాగ్ అశ్విన్ ముందున్న బిగ్ టాస్క్. కల్కి 1 సూపర్ హిట్ అయ్యింది కాబట్టి పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. సో స్పీడ్ స్పీడ్ గా లాగిచ్చేస్తే పని అవ్వదు. ఐతే కల్కి 2 షూటింగ్ ఎప్పుడని నాగ్ అశ్విన్ ని అడిగితే అందరు యాక్టర్స్ బిజీగా ఉన్నారు. వాళ్లందరు వచ్చినప్పుడు మొదలు పెడతాం అంటున్నాడు.

అసలైతే ఈ ఇయర్ ఎండింగ్ లో కల్కి 2 స్టార్ట్ చేసే ఆలోచన ఉందని అన్నాడు నాగ్ అశ్విన్. కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసమే 2, 3 ఏళ్లు టైం పడుతుందని షాక్ ఇచ్చాడు. సో కల్కి 2 కోసం ఎలా లేదన్నా మరో 3 ఏళ్లు తప్పకుండా వెయిట్ చేయాల్సిందే అని నాగ్ అశ్విన్ చూచాయగా చెప్పాడు.

2026, 2027, 2028 కూడా ప్రభాస్ నాలుగు సినిమాలకే..

కల్కి 2 వచ్చే లోగా ప్రభాస్ నాలుగు సినిమాలు చేసేలా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. అది ఎలాగు 2026 జనవరి రిలీజ్ పక్కా అవుతుంది. ఇక నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఫౌజీ కూడా వదిలే ఛాన్స్ ఉంది. ఇక సందీప్ తో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాను 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి 2027 రిలీజ్ పక్కా అనే టాక్ వినిపిస్తుంది.

వీటితో పాటు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా పూర్తయ్యాక ప్రభాస్ తో సలార్ 2 చేసేలా ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. సో 2026, 2027, 2028 కూడా ప్రభాస్ ఈ నాలుగు సినిమాలకే కేటాయిస్తున్నాడు. సో కల్కి ఈలోగా సెట్స్ మీదకు వెళ్తే 2029 రిలీజ్ ఉంటుంది. నాగ్ అశ్విన్ 2, 3 ఏళ్లని చెప్పాడు కానీ అది కచ్చితంగా మరో 4 ఏళ్లు టైం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి నాగ్ అశ్విన్ కల్కి 2 విషయంలో ఏం జరుగుతుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News