• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కలియుగం పట్టణంలో.....

కలియుగం పట్టణంలో.. వచ్చేది ఎప్పుడంటే..

| ప్రస్తుతం విశ్వ.. కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీతో రాబోతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-02-19 11:36 GMT

విశ్వ కార్తికేయ.. బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. బాలనటుడిగా 50కిపైగా సినిమాల్లో నటించిన విశ్వ.. జై సేన చిత్రంతో హీరో అయిపోయారు. కళాపోషకులు, అల్లంత దూరాన మూవీల్లో తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం విశ్వ.. కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీతో రాబోతున్నారు.


మంచి మెసేజ్ ఇచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో 45 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ మూవీని కందుల గ్రూప్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా చిత్రీకరణ పూర్తయిందని నిర్మాత తెలిపారు. అందుకు సహకరించిన చిత్ర బృందానికి థ్యాంక్స్ చెప్పారు.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు నిర్మాత ఓబుల్ రెడ్డి తెలిపారు. మార్చి 22వ తేదీన ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. అందుకు మేకర్స్ ప్రస్తుతం ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని సినీ ప్రియులు ఆదరిస్తారన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

ఈ సినిమాను కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తుండగా.. రమా కాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. స్క్రీన్ ప్లే బాధ్యతలను ఆయనే చేపట్టారు. డైలాగ్స్ కూడా ఆయనే అందించారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కార్తికేయకు జోడీగా ఆయుషీ పటేల్ నటిస్తోంది.

కలియుగం పట్టణంలో మూవీకి ఎడిటర్ గా ఫేమస్ టెక్నీషియన్ గారీ బిహెచ్ వ్యవహరిస్తున్నారు. అజయ్ అర్సాద మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రముఖ గేయరచయితలు చంద్రబోస్, భాస్కర భట్ల సాహిత్యం అందిస్తుండగా.. చరణ్ మాధవనేయ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. మరి ఈ కలియుగం పట్టణంలో మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Whose votes will YS Sharmila split?#YSSharmila #CongressParty #YSRCP #TDPJanasena #AndhraPradesh #Tupaki

— Tupaki (@tupaki_official) February 19, 2024
Tags:    
  • Tollywood 
  • Kaliyuga 
  • Vishwakarthikeya 
  • Allanthadoorana 
  • Kandulachandraobulreddy 
  • Ramakanthreddy 

Similar News

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

Copyright @2026

Powered by Blink CMS