కత్తికిందకు వెళ్లాలా? లేదా? అన్నది వాళ్ల చేతుల్లోనే!
తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటి కోజోల్ తన అభిప్రాయాన్ని పంచుకుంది.;
లైపోసర్జీలు...కాస్మోటిక్ సర్జీలు సెలబ్రిటీలకు కొత్తేం కాదు. గ్లామర్ వరల్డ్ లో రాణించాలంటే? ఇలాంటి వాటిని తప్పనసరిగా భావిస్తుంటారు. వయసు తో సంబంధం లేకుండా...ఆడ మగ అనే తేడా లేకుండా అసవరంగా భావించిన వారంతా సర్జరీలలో తరూపాన్ని మార్చుకుంటారు. పోటీలో రాణించాలన్నా? కొత్త వారితో పోటీ పడాలన్నా? చాలా మంది సెలబ్రిటీలు సర్జరీలు తప్పని సరిగా భావిస్తుంటారు కొన్ని సందర్భాల్లో లైపో సర్జరీలు వికటించి మృత్యువాత పడిన వారు కూడా ఉన్నారు.
తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటి కోజోల్ తన అభిప్రాయాన్ని పంచుకుంది. సర్జరీలు అనేవి వారి వ్యక్తిగత విషయం. ఒకరిని జడ్జ్ చేసే చేయకూడదు. కాస్మోటిక్ సర్జరీలు కేవలం మహిళలు మాత్రమే చేయించుకోవడం లేదు. పురుషులు కూడా చేయించుకుంటున్నారు. కత్తికిందకు వెళ్లాలా? లేదా? అన్నది వారి వ్యక్తి గత ఇష్టం. వృద్ధాప్యం అనేది వయసుకు సంబంధించిన విషయం. కానీ వృద్ధాప్యానికి చేరుకుం టామా? లేదా? అన్నది కొంత వరకూ మన చేతుల్లోనే ఉంటుంది.
కసరత్తులతో వృద్దాప్యాన్ని కొంత కాలం వాయిదా వేయోచ్చు. యెగా, జిమ్, రన్నింగ్ లాంటివి ఎంతో బాగా పనికొస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మంచివి . కొంత మంది చిన్న వయసులోనే చనిపోతారు. అలాంటి వారు వృద్దాప్యానికి చేరుకోరు. అలాగని వారు అదృష్టవంతులని కాదు. అంటే వారికి వృద్ధాప్యాన్ని అనుభవించే అవకాశం లేకుండా పోయిందని అర్దం. నాకోసం జీవించడానికి ఇంకా చాలా అద్బుతమైన సంవత్సరాలు మిగిలి ఉన్నాయని భావిస్తున్నాను. కానీ జీవితం అన్నది నీటి బుడగల లాంటింది.
ఈరోజు ఉన్న జీవితం రేపు ఉండక పోవచ్చు అన్నది అంతే వాస్తవం. మనిషిని మృత్యువు ఎలా కబళిస్తుందో తెలిదు. అది మన చేతుల్లో లేదు. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉందని బలంగా నమ్ముతాను. అందుకే ఆరోగ్యంగా ఉండేదుకు నా వంతు ప్రయత్నం ఎప్పుడూ విస్మరించను' అని అన్నారు.