కాజల్‌కు బాలయ్య ఆశీర్వాదం.. వైరల్ వీడియో!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు వేడుకలు ఈసారి ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా NBK111 సెట్స్‌లో ఘనంగా జరిగాయి.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు వేడుకలు ఈసారి ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా NBK111 సెట్స్‌లో ఘనంగా జరిగాయి. జూన్ 19న పుట్టినరోజు జరుపుకున్న కాజల్‌కు చిత్ర యూనిట్ ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇవ్వడంతో ఆ వేడుకలు మరింత ప్రత్యేకంగా మారాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. NBK111 సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ స్పాట్ లో చిత్ర యూనిట్ కాజల్ కోసం స్పెషల్ గా కేక్ ఏర్పాటు చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. యూనిట్ సభ్యులంతా కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయగా, కాజల్ కూడా ఆనందంగా కేక్ కట్ చేసి అందరితో ఆ సంతోషాన్ని పంచుకుంది.
అయితే ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించిన క్షణం హీరో నందమూరి బాలకృష్ణ కాజల్‌కు బొకే అందించి శుభాకాంక్షలు చెప్పడంతో పాటూ, ఆమె తలపై చేయి ఉంచి ఆశీర్వదించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కాజల్ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని బాలకృష్ణ ఆకాంక్షించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.
కాజల్ మరియు బాలకృష్ణ కాంబినేషన్‌కు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య కనిపించిన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఇప్పుడు NBK111పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు కాజల్ గ్లామర్, యాక్టింగ్ తోడవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో మంచి బజ్ కనిపిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను డైరెక్టర్ గోపీంచద్ మలినేని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా బాలకృష్ణ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన పలు అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా కాజల్ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో కూడా సినిమాపై మరింత పాజిటివ్ బజ్‌ను తీసుకొచ్చింది. మొత్తానికి, NBK111 సెట్స్‌లో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలు కేవలం సెలబ్రేషన్ మాత్రమే కాకుండా, చిత్ర యూనిట్ మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఆశీర్వాదాలతో కాజల్ పుట్టినరోజు మరింత గుర్తుండిపోయే సందర్భంగా మారిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.