ఆదివారం సెల‌విచ్చే ఏకైక డైరెక్ట‌ర్!

సినిమా షూటింగ్ అంటే ఎలా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యే వ‌ర‌కూ సెట్స్ లో ఎంతో బిజీగా ఉంటుంది. వంద‌లాది మంది కార్మికులు ప‌నిచేస్తుంటారు.;

Update: 2025-06-13 15:30 GMT

సినిమా షూటింగ్ అంటే ఎలా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యే వ‌ర‌కూ సెట్స్ లో ఎంతో బిజీగా ఉంటుంది. వంద‌లాది మంది కార్మికులు ప‌నిచేస్తుంటారు. ఓ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు నుంచే 24 క్రాప్ట్ కి సంబంధించిన ప‌ను లు నిరంత‌రం జ‌రుగుతుంటాయి. ఇక సెట్ నిర్మాణం ప‌నుల్లో కార్మికుల పాత్ర అన్న‌ది ఎంతో కీల‌క‌మైంది. రోజంతా క‌ష్ట‌ప‌డి పనిచేయాల్సి ఉంటుంది. హీరో-హీరోయిన్-న‌టీన‌టులు..డైరెక్ట‌ర్ ఇలా వ‌చ్చి అలా ప‌ని పూర్తి చేసుకుని వెళ్లిపోతారు.

కానీ ఆ సెట్ నిర్మాణం ఓ రూపానికి రావాలంటే నెల‌లు ...రోజుల త‌ర‌బ‌డి కార్మికులు ప‌ని చేస్తుంటారు. అస‌వ‌రాన్ని బ‌ట్టి 24 గంట‌లు కూడా ప‌నిచేయాల్సి ఉంటుంది. సినిమాలో న‌టీన‌టులు సెట్ కు వ‌చ్చిన త‌ర్వాత కొన్ని గంట‌ల పాటు నిర్విరామంగా ప‌నిచేయాల్సి ఉంటుంది. డే అండ్ నైట్ వాళ్ల‌కి త‌ప్ప‌దు. ద‌ర్శ‌కుల ఆదేశాల మేర‌కు న‌డుచుకోవాల్సి ఉంటుంది. ఇష్టారీతున వ‌చ్చివెళ్తామంటే కుద‌రదు.

ఓ షెడ్యూల్ మొద‌లైందంటే పూర్త‌య్యే వ‌ర‌కూ జ‌రుగుతూనే ఉంటుంది. మ‌ధ్య‌లో ఎలాంటి సెల‌వులు ఉండ‌వు. ఆ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత కొత్త షెడ్యూల్ కి కొంత స‌మ‌యం తీసుకుని మొద‌లు పెడ‌తారు. ఈ మ‌ధ్య‌లోనే గ్యాప్ దొరుకుతుంది. గ్యాప్ వ‌చ్చినా బ్యాకెండ్ లో జ‌ర‌గాల్సిన ప‌ని నిర్విరామంగా జ‌రుగు తూనే ఉంటుంది. డైరెక్ట‌ర్ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌రు.

అయితే బాలీవుడ్ డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్ మాత్రం తాను ఏ ప్రాజెక్ట్ మొద‌లు పెట్టిన త‌ప్ప‌ని స‌రిగా ఆదివారం వ‌స్తే మాత్రం త‌న‌తో పాటు అంద‌రూ సెల‌వు తీసుకుంటారుట‌. ఆ ఒక్క రోజు మాత్రం అంద‌రికీ సెల‌వు దినంగా ప్ర‌క‌టించి కుటుంబాల‌తో సంతోషంగా ఉండాల‌నే ఆయ‌న ఈ రూల్ పాటిస్తున్న‌ట్లు తెలిపారు. ప‌ని గంట‌ల విష‌యంలో దీపికా ప‌దుకొణే అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పిన నేప‌థ్యంలో ఆమెను స‌మ‌ర్దిస్తు క‌బీర్ ఖాన్ అలా స్పందించారు.

Tags:    

Similar News