సెప్టెంబ‌ర్ రేసు నుంచి కాంత అవుట్?

ల‌క్కీ భాస్క‌ర్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దుల్కర్ స‌ల్మాన్ కు మ‌ల‌యాళంతో పాటూ తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది.;

Update: 2025-08-25 11:30 GMT

ల‌క్కీ భాస్క‌ర్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దుల్కర్ స‌ల్మాన్ కు మ‌ల‌యాళంతో పాటూ తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. అత‌ను తెలుగులో చేసిన మ‌హాన‌టి, సీతారామం, ల‌క్కీభాస్క‌ర్ సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఎంతగానో ఆద‌రించారు. వాటితో పాటూ ఆయ‌న న‌టించిన సినిమాల‌న్నీ తెలుగు ఆడియ‌న్స్ చూస్తూనే ఉంటారు.

మ‌ద్రాస్ బ్యాక్ డ్రాప్ క‌థ‌తో..

ల‌క్కీ భాస్క‌ర్ త‌ర్వాత దుల్క‌ర్ ప్ర‌స్తుతం కాంత అనే పీరియాడికల్ డ్రామా చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ద్రాస్ బ్యాక్ డ్రాప్ లో ఓ మూవీ తీయ‌డం వెనుక ఉన్న క‌థ‌నే కాంత సినిమాగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ లో దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించ‌నుండ‌గా డైరెక్ట‌ర్ పాత్ర‌లో స‌ముద్ర‌ఖ‌ని న‌టిస్తున్నారు. మ‌ద్రాస్ నేప‌థ్యంలో అల‌నాటి రోజుల్ని గుర్తు చేసేలా ఉన్న ఇంటెన్స్ లుక్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

సెప్టెంబ‌ర్ 12 నుంచి వాయిదా

సెల్వ‌మ‌ణి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా వాస్త‌వానికి సెప్టెంబ‌ర్ 12న రిలీజ్ కావాలి. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా ప‌డుతుంద‌ని పుకార్లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వాయిదా కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన కాంత సినిమాను సెప్టెంబ‌ర్ నుంచి వాయిదా వేసి అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు. దీపావళి కార‌ణంగా అక్టోబ‌ర్ మూడో వారంలో కాంత‌ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే కాంత సినిమా సెప్టెంబ‌ర్ 12 నుంచి వాయిదా ప‌డుతుంద‌ని కానీ అక్టోబ‌ర్ లో దీపావ‌ళి కానుక‌గా రిలీజ‌వుతుంద‌ని కానీ మేక‌ర్స్ ఇంకా అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు. స్పిరిట్ మీడియా, వేఫేర‌ర్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ల‌లో రానా ద‌గ్గుబాటి, దుల్క‌ర్ స‌ల్మాన్, జోమ్ వ‌ర్గీస్, ప్ర‌శాంత్ పొట్లూరి కాంత‌ను నిర్మిస్తుండ‌గా, భాగ్య శ్రీ బోర్సే ఈ మూవీలో హీరోయిన్ గా న‌టిస్తున్నారు.

Tags:    

Similar News