ఒకటే ముద్దు..రీటేకులొద్దు!
బాలీవుడ్ సినిమా ఎంతో అప్ డేట్. ఎలాంటి సన్నివేశంలోనైనా నటీనటులు దర్శకుల అభిరుచి మేరకు పనిచేస్తారు. ముద్దు సన్నివేశాలు..ఇంటిమేట్ సన్నివేశాలు..రొమాంటిక్ సన్నివేశాల్లో బాలీవుడ్ ఎప్పుడో ఆరితేరింది.;
బాలీవుడ్ సినిమా ఎంతో అప్ డేట్. ఎలాంటి సన్నివేశంలోనైనా నటీనటులు దర్శకుల అభిరుచి మేరకు పనిచేస్తారు. ముద్దు సన్నివేశాలు..ఇంటిమేట్ సన్నివేశాలు..రొమాంటిక్ సన్నివేశాల్లో బాలీవుడ్ ఎప్పుడో ఆరితేరింది. అలాంటి సన్నివేశాలన్ని మిగతా పరిశ్రమల్లో కి వచ్చాయంటే బాలీవుడ్ మాత్రమే కారణం. సౌత్ పరిశ్రమలు రొమాంటిక్ సన్నివేశాల్లో చాలా కాలం పాటు వెనుకబడే ఉంది. ఈ విషయంలో బాలీవుడ్ ని స్పూర్తిగా తీసుకునే సౌత్ పరిశ్రమలు ముందుకెళ్తున్నాయన్నది కాదనలేని నిజం. అలాంటి పరిశ్రమలో పుట్టి పెరిగిన ఓ నటి ముద్దు విషయంలో కండీషన్ పెట్టిందంటే నమ్మడం కష్టమే.
దివ్య భారతి పోషించాల్సిన రోల్:
కానీ ఇది నమ్మాల్సిన నిజం. ఓసారి ఆవివరాల్లోకి వెళ్తే సన్ని డియోల్, జుహీ చావ్లా జంటగా ధర్మేష్ దర్శన్ తెరకెక్కించిన `లూటేరే` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 1993లో తెరకెక్కిన యాక్షన్ కం లవ్ స్టోరీ ఇది. సునీల్ దర్శన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్ట్ లోకి జూహీ చావ్లా రావడం అన్నది అనూహ్యంగా జరిగింది. తొలుత ఆ పాత్రకు దివ్య భారతిని తీసుకోవాలనుకున్నారు. ఆ సమయంలో దివ్య భారతి మంచి ఫాంలో ఉండటంతో ఆమె నాయికగా ఫిక్స్ చేసారు. కానీ ఆ పాత్రకు దివ్య భారతి సూట్ కాకపోవడంతో అప్పటికప్పుడు జుహీచావ్లాను ఎంపిక చేసారు.
సీన్ డిమాండ్ తో తప్పలేదు:
సినిమాలో `మే తేరీ రాణీ తూ రే ఆజా` అనే ఓ బీచ్ సాంగ్ ఉంటుంది. ఆ పాటలో షర్ట్ ధరించి తడిచిన దుస్తుల్లో అందాలు ఆరబోయాలి జుహీచావ్లా. అప్పటికి జుహీచావ్లా పై డీసెంట్ ఇమేజ్ ఉంది. గ్లామర్ పాత్రలు పోషించలేదు. ఒక్కసారిగా తడిచిన అందాల్లో కనిపించాలంటే ఇబ్బంది పడింది. కానీ సీన్ డిమాండ్ చేయడంతో తప్పలేదు. అప్పటికే ఓ ముద్దు సన్నివేశం ఉందని కూడా మేకర్స్ చెప్పారు. అందుకు ఆమె అంగీకరించింది.
నిర్మాతను ఎదురించిన నటి:
ఆ సన్నివేశం ఔట్ డోర్ లో షూట్ చేయాల్సి ఉంది. విషయం జుహీకి చెప్పగానే మరో సినిమా షూటింగ్ఉందని తప్పించుకుందట. ఆరోజుకైతే తప్పించుకోగలగింది గానీ మరుసటి రోజు మాత్రం మేకర్స్ రాజీ పడలేదు. నటించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఎలాగూ సన్నిడియోల్ తో ముద్దు సీన్ లో నటించింది. కానీ తొలి టేక్ లో ఆసీన్ సరిగ్గా రాలేదు. దీంతో రీటేక్ చెప్పారు. కానీ అందుకు జుహీ చావ్లా అంగీకరించలేదు. ఒకటే ముద్దు సీన్ అని చెప్పి ఎన్నిసార్లు చేయిస్తారని ప్రశ్నించింది. చేసాను కదా? మళ్లీ చేయడం ఏంటని గట్టిగానే వాధించింది. దీంతో చేసేందేం లేక మేకర్స్ ఆ సీన్ తో నే సరిపెట్టుకున్నట్లు నిర్మాత వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.