హీరోలకు - ఫ్యాన్స్ కు మధ్య దూరం పెరుగుతోందా?

ఇలాంటి రోజుల్లో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన కేవలం స్క్రీన్ మీదే కాదు, కిచెన్‌లోనూ కింగ్ అని నిరూపించుకున్నారు.

Update: 2026-06-06 09:36 GMT

ఒకప్పుడు తమ అభిమాన హీరోలు సోషల్ మీడియాలో నేరుగా రిప్లై ఇస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండేవి కావు. కానీ కాలం మారింది, ఇప్పుడు స్టార్ హీరోలు అభిమానులకు అందుబాటులో ఉండటం లేదు. నెగెటివిటీని భరించలేక చాలామంది అగ్ర నటులు తమ అకౌంట్లను నిర్వహించడానికి 'పీఆర్ టీమ్స్' ను పెట్టేసుకున్నారు. దీనివల్ల హీరోలకు, ఫ్యాన్స్‌కు మధ్య దూరం పెరుగుతోందా అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన ఒక స్పెషల్ మ్యాజిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

పీఆర్ టీమ్స్ హవా.. పోయిన పర్సనల్ టచ్:

సోషల్ మీడియా మొదలైన కొత్తలో హీరోలు స్వయంగా ఫ్యాన్స్ కామెంట్లకు రిప్లై ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విమర్శలు, నెగెటివిటీ బాగా ఎక్కువైపోయాయి. వీటిని తట్టుకోలేక చాలామంది స్టార్స్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక తమ అకౌంట్స్ చూసుకోవడానికి ప్రత్యేకంగా పీఆర్ టీమ్స్‌ను నియమించుకున్నారు. ఇక దీనివల్ల కేవలం సినిమాల ప్రమోషన్లు తప్ప, ఫ్యాన్స్‌తో ఉండే ఆ 'పర్సనల్ టచ్' పూర్తిగా కరువైపోయింది.

ఎన్టీఆర్ కుకింగ్ టాలెంట్.. కొత్త సర్ప్రైజ్:

ఇలాంటి రోజుల్లో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన కేవలం స్క్రీన్ మీదే కాదు, కిచెన్‌లోనూ కింగ్ అని నిరూపించుకున్నారు. ఇక ఆయనే స్వయంగా ఎంతో ఇష్టంగా కుకీస్ బేక్ చేసి, ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ లోని ఈ కొత్త కోణాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

అభిమానికి లక్కీ గిఫ్ట్:

ఈ వీడియో చూసిన ఒక లక్కీ ఫ్యాన్, ఎక్స్ వేదికగా ఆ కుకీస్ తనకు కావాలంటూ సరదాగా ఎన్టీఆర్‌ను అడిగాడు. దానికి ఎన్టీఆర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నిజంగానే ఆ కుకీస్‌ను ప్యాక్ చేయించి ఆ అభిమాని ఇంటికి పంపించారు. ఇక ఆ స్టార్ హీరో చూపించిన ప్యూర్ లవ్ చూసి ఆ ఫ్యాన్ ఆనందానికి హద్దులు లేవు. ఆ రోజు అతని లైఫ్‌లోనే మర్చిపోలేని రోజుగా నిలిచిపోయింది.

ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ ఫన్నీ ఎమోజీలు:

కేవలం గిఫ్ట్‌లు పంపడమే కాదు.. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో చాలామంది ఫ్యాన్స్ అడిగిన క్రేజీ ప్రశ్నలకు ఎన్టీఆర్ తనదైన శైలిలో ఫన్నీ ఎమోజీలతో క్రేజీగా రిప్లైలు ఇచ్చారు. ఒక టాప్ స్టార్ హీరో ఇలా నేరుగా రంగంలోకి దిగి ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేయడంతో, ఆ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.

ప్రశాంత్ నీల్ కాంబోలో 'డ్రాగన్':

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం 'కె.జి.ఎఫ్', 'సలార్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి తన తదుపరి డ్రాగన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది..ఇక అత్యున్నత సాంకేతిక విలువల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తూ, ఈ సినిమాను 2027 జూన్ నాటికి థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

పీఆర్ టీమ్స్ హడావుడి మధ్య హీరోలు ఫ్యాన్స్‌కు దూరమవుతున్నారనే మాట నిజమే అయినా, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ అప్పుడప్పుడు చేసే ఇలాంటి పనులు అభిమానుల్లో కొత్త జోష్ నింపుతాయి. మిగతా స్టార్ హీరోలు కూడా పీఆర్ టీమ్స్‌ను పక్కన పెట్టి, అప్పుడప్పుడైనా సోషల్ మీడియాలో నేరుగా ఫ్యాన్స్‌తో మాట్లాడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News