తెర వెనుక నాయకుడు.. బుజ్జి అభిమానుల కోసం బిస్కెట్లు!
వెండితెరపై భారీ యాక్షన్ సీన్లు.. పవర్‌ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే స్టార్ హీరోలు నిజ జీవితంలో చూపించే మానవత్వం ,సున్నితత్వం అభిమానుల హృదయాలను అమితంగా ఆకట్టుకుంటాయి.
వెండితెరపై భారీ యాక్షన్ సీన్లు.. పవర్‌ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే స్టార్ హీరోలు నిజ జీవితంలో చూపించే మానవత్వం ,సున్నితత్వం అభిమానుల హృదయాలను అమితంగా ఆకట్టుకుంటాయి. తెరపై వారిని ఎంతటి రౌద్ర రూపంలో చూసినా? వ్యక్తిగత జీవితంలో వారు చూపించే ఆప్యాయత నటీనటులను ప్రజలకు మరింత దగ్గర చేస్తుంది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ఓ మధురమైన సంఘటన సోషల్ మీడియా లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న తారక్.. తన బిజీ షూటింగ్ షెడ్యూల్స్ మధ్య కూడా చిన్నారి అభిమానుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు.
తన ఇంటికి వచ్చిన బుజ్జి అభిమానుల కోసం స్వయంగా చిన్న పిల్లల అభిరుచికి అనుగుణంగా ఆయన స్వహస్తాలతో రుచికరమైన బిస్కెట్లను తయారు చేసారు. ఈ ప్రక్రియలో తారక్ చూపించిన శ్రద్ధ, పిల్లలతో సరదాగా గడిపిన క్షణాలు చూస్తుంటే తారక్‌కు పిల్లల పట్ల ఉన్న అమితమైన ప్రేమ తెలుస్తుంది. షూటింగ్ ఒత్తిడిని పక్కన పెట్టి పిల్లల ముఖాల్లో ఆనందం చూడటం కోసమే ఆయన ఈ విందును ఏర్పాటు చేశారు. ఈ మధురమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలు - వీడియోలు అంతర్జాలంలో ప్రత్యక్షం అవ్వడంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
`తెరపై ఎంతటి ఉగ్రరూపమైనా చూపిస్తారు కానీ, నిజ జీవితంలో మాత్రం ఆయన ఎంతో సున్నితమైన వ్యక్తి` అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ క్యూట్ గెస్టర్ చూసి అంతా మురిసిపో తున్నారు. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `డ్రాగన్` సినిమాపై ప్రేక్షకుల్లో ..ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. `సలార్`, `కేజీఎఫ్` చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతున్నారో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఈ సినిమా అనంతరం మరో రెండు సినిమాలు ఏక కాలంలో చేసే అవకాశం ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. అలాగే కొరటాల శివ తో కలసి `దేవర 2` పూర్తి చేయాలి. `డ్రాగన్` అనంతరం ఉన్న పళంగా దేవర2 పట్టాలెక్కనుంది. ఇంకా కోలీవుడ్ దర్శకులతోనూ తారక్ మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు టైగర్ తోకలిసి పని చేయాలని సందీప్ రెడ్డి వంగా కూడా అంతే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.