న‌టి జ‌య‌సుధ భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం?

స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల్లో త‌న‌దైన స‌హ‌జ‌న‌ట‌న‌తో ప్ర‌జ‌ల‌ హృద‌యాల‌ను గెలుచుకున్నారు.;

Update: 2025-07-31 07:14 GMT

స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల్లో త‌న‌దైన స‌హ‌జ‌న‌ట‌న‌తో ప్ర‌జ‌ల‌ హృద‌యాల‌ను గెలుచుకున్నారు. తెలుగు నాట అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన జ‌య‌సుధ ప్ర‌ముఖ హిందీ నిర్మాత, జీతేంద్ర క‌జిన్ నితిన్ క‌పూర్ ని రెండో వివాహం చేసుకున్నారు. అయితే నితిన్ క‌పూర్ కొన్ని సినిమాల నిర్మాణం కార‌ణంగా ఆర్థికంగా న‌ష్టాల‌ను ఎదుర్కొన్నార‌ని, దాని కార‌ణంగా తీవ్ర ఒత్తిడి(డిప్రెష‌న్‌)ని ఎదుర్కొన్నార‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఆయ‌న అక‌స్మాత్తుగా ముంబైలో త‌న త‌ల్లిదండ్రుల ఇంట్లో ఉన్న స‌మ‌యంలో ఏడు అంత‌స్తుల భ‌వంతి పైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ వార్త‌ను జీర్ణించుకోలేక‌పోయారు జ‌య‌సుధ‌ అభిమానులు. జ‌య‌సుధ‌, ఆమె కుటుంబం దీని నుంచి తేరుకునేందుకు కొన్ని సంవ‌త్సరాలు ప‌ట్టింది. ఆయ‌న ఎక్కువ‌గా ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌ల‌తో ఉండ‌టం క‌ల‌వ‌ర‌పెట్టేద‌ని జ‌య‌సుధ గ‌త ఇంట‌ర్వ్యూల‌లో చెప్పారు.

ఎన్నో ఒడిదుడుకులు ఒత్తిళ్లు:

ఇప్పుడు జ‌య‌సుధ - నితిన్ క‌పూర్ దంప‌తుల పెద్ద కుమారుడు నిహార్ క‌పూర్ త‌న తండ్రి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను వివ‌రించారు. నితిన్ స‌హ‌జంగానే ఫిట్ గా ఉండేవారు. జిమ్ కి వెళ్లేవారు. కానీ ఆయ‌న చిన్న వ‌య‌సు నుంచే సుగ‌ర్ (డ‌యాబెటిస్) స‌హా ప‌లు అనారోగ్యాల‌ను ఎదుర్కొన్నారు. ప‌దేళ్ల వ‌య‌సు నుంచి వున్న స‌మ‌స్య ఇది. జిమ్ కి వెళ్లి ఆరోగ్యం ప‌రంగా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన స్థితి. దానికి తోడు కెరీర్ ప‌రంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సినీనిర్మాత‌గా ఏదీ క‌లిసి రాలేదు. చాలా ఏళ్లుగా స‌క్సెస్ కోసం ట్రై చేస్తున్నా సాధ్య‌ప‌డ‌లేదు. ఇది ఒక్క‌టే కాదు... ఆయ‌న ఆరోగ్యం, కెరీర్, ఇత‌రత్రా చాలా విష‌యాలు క‌లిసి రాలేదు. ఒక‌సారి మొద‌లు పెట్టిన సినిమా ఆగిపోయింది. బాలీవుడ్ పెద్ద నిర్మాత ఒక‌ సినిమాని కొట్టేసాడు. వాళ్ల‌కు ఉన్న ఆర్థిక బ‌లం, లాయ‌ర్ల అండ కార‌ణంగా వారితో కోర్టు కేసు వేసి ఫైట్ చేయ‌లేము. ఇలాంటి వాటి వ‌ల్ల డిప్రెష‌న్ మ‌రింత పెరిగింది. ఒత్తిడిలో ఉన్న వ్య‌క్తుల‌కు స‌హ‌జంగానే, నా వ‌ల్ల కుటుంబం చాలా క‌ష్టాల్లో ప‌డింది.. వారంతా నావ‌ల్ల‌నే న‌ష్ట‌పోయారు అనే ఆలోచ‌న వ‌చ్చేస్తుంది. ఇది మ‌రింత డిప్రెష‌న్‌లోకి తీసుకుని వెళ్లింది.

చాలా సంపాదించాల‌నే త‌ప‌న‌:

నేను- అమ్మ- త‌మ్ముడు .. మాలో ఎవ‌రికీ మెటీరియ‌లిస్టిక్ ఆలోచ‌న‌లు లేవు. ల‌గ్జ‌రీ కార్ కావాలి.. పెద్ద‌ భ‌వంతి కావాలి. బంగారం కావాలి.. ఖ‌రీదైన ఫ్యాన్సీ బ‌ట్ట‌లు కావాలి.. వంటి ఆలోచ‌న‌లు మాలో లేవు. కానీ ఆయ‌న అలా కాదు. పేరు సంపాదించాలి.. ఇంకా చాలా సంపాదించాలి. నిర్మాత‌గా ఎద‌గాలి.. స‌క్సెస్ సాధించాల‌ని అనుకునేవారు. కానీ స్ట్ర‌గుల్ ని ఫేస్ చేసారు... అని నిహార్ తెలిపారు.

ఆ రోజుల్లో ల‌క్ష‌లు కోట్ల‌తో స‌మానం:

నాన్న గారు కోట్ల‌లో న‌ష్ట‌పోయారా? అని మీరు ప్ర‌శ్నిస్తే .. ఆరోజుల్లో ల‌క్ష‌లు కూడా కోట్ల‌తో స‌మానం. సినిమా రేంజును బ‌ట్టి న‌ష్టాలు ఉండేవి. నాన్న‌గారు డిప్రెష‌న్ లో ఉన్న స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య గురించి ప‌దే ప‌దే చెబుతూ ఉండేవారు. ప‌దేళ్ల నుంచి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని చెబుతూనే ఉన్నారు. కానీ ఒక బ‌ల‌హీన క్ష‌ణం రానే వ‌చ్చింది. ఆయ‌న త‌న అమ్మా నాన్న ఇంట్లో ఉన్న‌ప్పుడు ఏడు అంత‌స్తుల భ‌వంతి నుంచి దూకేసారు. ఆయ‌నకు ఒక్కోసారి డిప్రెష‌న్ పీక్స్ కి చేరుకుంటే, బైపోలార్ డిజార్డ‌ర్ స్టార్ట్ అవుతుంది. ఏడో అంత‌స్తు నుంచి దూకిన వ్య‌క్తి ఇంకా ఎలా బ‌తుకుతారు. ఆయ‌న‌ చ‌నిపోయారు. అప్ప‌టికే ఫిట్నెస్ ప‌రంగాను స‌మ‌స్య‌లున్నాయి. హెవీ డిప్రెష‌న్ కార‌ణంగా హెవీ మెడికేష‌న్ ఇచ్చేవారు. మైండ్ ని కామ్ చేయ‌డం కోసం మందులు ఎక్కువ వాడాల్సి వ‌చ్చేది. ఒక్కోసారి మ‌నిషి బ‌ల‌హీనంగా మారి జాంబీలా కూడా మారిపోతారు... అని నిహార్ క‌పూర్ తెలిపారు.

మాది న్యూక్లియ‌ర్ ఫ్యామిలీ:

ఈరోజుల్లో అన్నీ న్యూక్లియ‌ర్ కుటుంబాలే. మాది న్యూక్లియ‌ర్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఎవ‌రికి వారే స‌ప‌రేట్ గా ఉంటాము. నా భార్య నేను కుటుంబంగా స‌ప‌రేట్ గా, నా త‌మ్ముడు వాడి కుటుంబం స‌ప‌రేట్ గా, అమ్మ స‌ప‌రేట్ గా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తామ‌ని కూడా నిహార్ తెలిపారు.

Tags:    

Similar News