అతను అడగ్గానే ఏమీ ఆలోచించకుండా ఓకే చెప్పా
మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరొయిన్ గా నటించగా, జయరాం నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించారు.;
కాంతార సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. కాంతార మూవీతో యావత్ భారతదేశాన్ని నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా మెప్పించిన రిషబ్ శెట్టి రీసెంట్ గా ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్1 చేసి ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కాంతార కంటే కాంతార1 భారీ బడ్జెట్ తో, భారీ స్థాయిలో తెరకెక్కిన సంగతి తెలిసిందే.
సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న కాంతార1
పెట్టిన ఖర్చుకు తగ్గట్టే కాంతార1 బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతమున్న బుకింగ్స్ చూస్తుంటే త్వరలోనే కాంతార1 రూ.200 కోట్ల క్లబ్ లో చేరుతుందనిపిస్తోంది. మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరొయిన్ గా నటించగా, జయరాం నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించారు.
క్లైమాక్స్ లో జయరామ్ నట విశ్వరూపం
సినిమా మొదట్లో మామూలుగా కనిపించిన జయరామ్, క్లైమాక్స్ కు వచ్చేసరికి తన నట విశ్వరూపం చూపించారు. ఇంకా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్ లో జయరామ్ నుంచి వచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదేనని చెప్పొచ్చు. అయితే తనకు అసలు ఈ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయాన్నిరీసెంట్ గా జయరామ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
జయరామ్ సినిమాలు చూస్తూ పెరిగిన రిషబ్
కాంతార సినిమా చూసి తాను షాకై, రిషబ్ ను కంగ్రాట్యులేట్ చేయడానికి ఫోన్ చేస్తే, సర్ నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని, మీ మూవీస్ చూస్తూనే పెరిగానని చెప్పాడని, రిషబ్ ఫ్యామిలీ కేరళ- కర్ణాటక బోర్డర్ లో చాలా కాలం ఉండటంతో కన్నడతో పాటూ మలయాళ సినిమాలు కూడా చూసేవాడినని చెప్పాడని, ఆ తర్వాత కొంత కాలానికి రిషబ్ తనకు కాల్ చేసి కాంతార1 కథ చెప్పి, ఈ సినిమాలో నటించమని కోరాడని, రిషబ్ అడగ్గానే ఏమీ ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నానని జయరామ్ చెప్పుకొచ్చారు. దీంతో రిషబ్ శెట్టికి జయరామ్ పై ఉన్న నమ్మకమే అతనికి ఆ పాత్రను ఇచ్చేలా చేసిందని కామెంట్ చేస్తున్నారు.