చేతిపై ప్రియుడు ముద్దు పేరుతో జాన్వీ క‌పూర్!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమా కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. హిందీతో పాటు తెలుగులోనూ బ‌డా ప్రాజెక్టుల్లో న‌టిస్తూ ఇమేజ్ ను అంత‌కంత‌కు రెట్టింపు చేసుకుంటుంది

Update: 2026-07-09 08:17 GMT

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమా కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. హిందీతో పాటు తెలుగులోనూ బ‌డా ప్రాజెక్టుల్లో న‌టిస్తూ ఇమేజ్ ను అంత‌కంత‌కు రెట్టింపు చేసుకుంటుంది. ఇటీవ‌లే విడుద‌లైన `పెద్ది`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక అమ్మ‌డిలో ఫ్యాష‌న్ సెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ ర‌కంగాను జాన్వీ నిత్యం మీడియాలో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా సోదరి అన్షులా కపూర్ వివాహ రిసెప్షన్ వేడుకలో జాన్వీ అలంకరణ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన సిల్క్ చీరలో అద్భుతంగా క‌నిపించింది.

చేతికి వేసుకున్న‌ మెహందీ ద్వారా ప్రియుడు శిఖర్ పహారియాపై ఉన్న ప్రేమను చాటుకుంది. జాన్వీ మెహందీ డిజైన్‌లో హిందీలో `శిఖు` అని రాసి ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది శిఖర్ పహారియాకు ఉన్న ముద్దు పేరు కావడం గమనార్హం. గత కొంతకాలంగా ఇద్ద‌రి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నా? జాన్వీ ఇలా బహిరంగంగా సంకేతాలు ఇవ్వడం వారి బంధంపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ ప్రయాణం చాలా కాలంగా కొనసాగుతోంది.

టీనేజ్ నుంచే పరిచయమున్న ఇద్ద‌రు ఒకానొక దశలో విడిపోయినట్లు వార్త‌లొచ్చాయి. కానీ మూడేళ్ల‌గా మళ్లీ కలిసి పార్టీలు, వెకేషన్లు, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు తిరుగుతోన్న వైనం బాండింగ్ బ‌లంగానే ఉంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. గతంలో కూడా జాన్వీ మెడలో `శిఖు` పేరున్న లాకెట్‌ను ధరించి వార్తల్లో నిలిచారు. ఇలా ఇద్ద‌రి స్పీడ్ చూస్తుంటే త్వ‌ర‌లోనే వివాహ బంధంతో ఒక‌ట‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. జాన్వీ న‌టిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. అప్పుడే పెళ్లి చేసుకుంటే కెరీర్ పై ఆ ప్ర‌భావం ప‌డుతుంది? అన్న బెంగ కూడా అవ‌స‌రం లేదు.

ఎందుకంటే పెళ్లి కాని భామ‌ల‌కంటే పెళ్లైన భామ‌ల‌కు సినీ మార్కెట్ లో ఎలాంటి డిమాండ్ ఉందో తెలిసిందే. క్రేజ్ తో పాటు పారితోషికం కూడా రెట్టింపు అవుతుంది. పెళ్లైతే న‌టీమ‌ణుల్లో బ్ల్యూటీ కూడా రెట్టింపు అవుతోంది. కాబ‌ట్టి శిఖ‌ర్ తో మూడు ముళ్లు వేయించుకుని జాన్వీ న‌టిగా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినా? పెద్ద సమ‌స్య ఉండ‌దు. ఇక శిఖర్ పహారియా బ్యాక్ గ్రౌండ్ గ‌ట్టిదే. ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్ కుమార్ షిండే మనవడు. వ్యాపారవేత్తగా, పెట్టుబడిదారుడిగా గుర్తింపు పొందిన శిఖర్ ముంబై ఉన్నత వర్గాల్లో సుపరిచితమైన వ్యక్తి. ఇద్ద‌రి వివాహం విష‌యంలో అభిమానులు కూడా జాన్వీకి అన్ని ర‌కాలుగా మ‌ద్దుతుగానూ నిలుస్తున్నారు.

Tags:    

Similar News