స‌హ‌న‌టి విష‌యంలో అభ‌ద్ర‌త‌.. ఇదంతా పీఆర్ స్టంట్!

ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్ లో ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు బాగా న‌టించారు? అన్న చ‌ర్చ నెటిజనుల్లో సాగుతోంది. నేపో కిడ్ జాన్వీ క‌పూర్ ని స‌న్యా మ‌ల్హోత్రా డామినేట్ చేసిందన్న చ‌ర్చ కూడా సాగింది.;

Update: 2025-09-19 04:26 GMT

ప‌రిశ్ర‌మ ఇన్ సైడ‌ర్.. ప‌రిశ్ర‌మ‌కు ఔట్ సైడ‌ర్.. ఈ టాపిక్ పై చాలా కాలంగా బిగ్ డిబేట్ ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. సినీప‌రిశ్ర‌మ‌లో బంధుప్రీతి, నేపోటిజం గురించి చాలా చ‌ర్చ జ‌రుగుతున్న ఈ స‌మ‌యంలో ఒక ఇన్ సైడ‌ర్, ఒక ఔట్ సైడ‌ర్ క‌లిసి ఒకే మూవీలో న‌టిస్తే, ఆ సినిమాలో ఎవ‌రి డామినేష‌న్ కొనసాగింది? అనేది ప్ర‌త్యేకించి చ‌ర్చ‌గా మారుతుంది. ఇప్పుడు స‌న్నీ సంస్కారీకి తుల‌సి కుమారి సినిమాలో న‌టించిన జాన్వీక‌పూర్, స‌న్యా మ‌ల్హోత్రా పై ఇలాంటి చ‌ర్చ కొన‌సాగుతోంది.

ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్ లో ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు బాగా న‌టించారు? అన్న చ‌ర్చ నెటిజనుల్లో సాగుతోంది. నేపో కిడ్ జాన్వీ క‌పూర్ ని స‌న్యా మ‌ల్హోత్రా డామినేట్ చేసిందన్న చ‌ర్చ కూడా సాగింది. వ‌రుణ్ ధావ‌న్- జాన్వీక‌పూర్ ప్ర‌ధాన లీడ్ పాత్ర‌ల్లో న‌టించినా కానీ, స‌న్యా- రోహిత్ స‌రాఫ్ లాంటి ఔట్ సైడ‌ర్ల డామినేష‌న్ కొన‌సాగింద‌ని, ప్ర‌తిభావంతుల‌కు స‌రైన అవ‌కాశాలు ద‌క్క‌డం లేద‌ని కూడా కొంద‌రు నెటిజ‌నులు విమ‌ర్శించారు. తాజాగా రిలీజైన గురు రంధ‌వా ప్ర‌చార గీతంలో జాన్వీకి ప్రాధాన్య‌త‌నిచ్చి, స‌న్యా మ‌ల్హోత్రాను దూరం పెట్ట‌డాన్ని కూడా నెటిజ‌నులు నిల‌దీస్తున్నారు.

అంతేకాదు.. స‌న్యా మ‌ల్హోత్రా విష‌యంలో జాన్వీక‌పూర్ పూర్తిగా అభ‌ద్ర‌త‌కు లోన‌వుతోంద‌ని, త‌న‌ను డామినేట్ చేస్తున్న స‌న్యాను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని కూడా కొంద‌రు విమర్శించారు. నట‌వార‌సురాలు జాన్వీక‌పూర్ తీవ్ర‌మైన ట్రోలింగుకి గుర‌వుతోంది. అయితే ఇంత‌లోనే జాన్వీని డిపెండ్ చేసేందుకు సోష‌ల్ మీడియాలో ఒక వ‌ర్గం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. స‌న్యా తో జాన్వీ స‌ర‌దాగా క‌లిసిపోయి న‌వ్వుతూ క‌నిపించిన‌ కొన్ని ఫోటోల‌ను షేర్ చేస్తూ, ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఎలాంటి స‌మ‌స్యా లేద‌ని, ఇదంతా ప‌బ్లిసిటీ కోసం పీఆర్ స్టంట్ అని కూడా ఇక సెక్ష‌న్ వాదిస్తోంది. స‌న్యా మ‌ల్హోత్రా గొప్ప ప్ర‌తిభావంతురాలు. అయినా ప‌రిశ్ర‌మ ఔట్ సైడర్ కాబ‌ట్టి స‌హాయ పాత్ర‌ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తోంద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. వ‌రుణ్ ధావ‌న్, రోహిత్ స‌రాఫ్ విష‌యంలోను ఇలాంటి ట్రోలింగ్ కొన‌సాగుతోంది.

Tags:    

Similar News