విజయ్ 'జన నాయగన్'.. ఆ పనితో దానయ్య సేఫ్!

అలాంటి పరిస్థితి నుంచి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తప్పించుకున్నారనే చెప్పాలి.;

Update: 2026-01-08 22:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ జన నాయగన్ విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. విజయ్ చివరి మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ సెన్సార్ అడ్డంకులతో విడుదల వాయిదా పడింది. లేకుంటే మరికొన్ని గంటల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది.

విడుదలకు రెండ్రోజుల ముందు సెన్సార్ సమస్యలతో రిలీజ్ ను వాయిదా వేయాల్సి రావడంతో నిర్మాతలు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. మద్రాసు హైకోర్టు ఇవ్వనున్న తుది ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితిని వారు కూడా ఊహించకపోయి ఉంటారు.. కానీ ఏం చేస్తారు.. తప్పలేదు. సినిమా రిలీజ్ తో బిజీగా ఉండాల్సిన వేళ.. కొత్త విడుదల తేదీపై చర్చలు జరుపుతున్నారు.

అలాంటి పరిస్థితి నుంచి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తప్పించుకున్నారనే చెప్పాలి. ఒక్క పనితో ఆయన సేఫ్ అయ్యారు. నిజానికి జన నాయగన్ మూవీని దానయ్య నిర్మించాల్సి ఉంది. సినిమాను రూపొందించేందుకు ముందుకు వచ్చారు. కానీ విజయ్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆయన పక్కకు తప్పుకున్నారు. కానీ అప్పటికే సినిమా కోసం కొన్ని కోట్ల రూపాయలను ఆయన ఇన్వెస్ట్ చేశారు.

అయితే దానయ్య తప్పుకోవడంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ.. జన నాయగన్ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చింది. విజయ్ కు రూ.220 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఒప్పుకుందని సమాచారం. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఖర్చుల సహా పలు విషయాలకు దానయ్య పెట్టిన డబ్బులను ఇచ్చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు సినిమా మొత్తం రెడీ చేసి.. రిలీజ్ చేస్తామన్న టైమ్ లో సెన్సార్ వల్ల అడ్డంకులు వచ్చాయి.

దీంతో చేసేదేం లేక వాయిదా వేశారు మేకర్స్. అయితే గత ఏడాది డిసెంబర్ లోనే సెన్సార్ బోర్డుకు మూవీ కాపీ పంపారు. అప్పుడు అధికారులు పలు మార్పులు సూచించడంతో.. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి, మరికొన్ని డైలాగ్స్ ను మ్యాట్ చేసి మళ్లీ పంపారు. కానీ ఇప్పటి వరకు స్పందన లేకపోవడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కానీ సెన్సార్ బోర్డు.. ఇంకా 20 సమయం పడుతుందని న్యాయస్థానానికి చెప్పింది.

ఇంతలో కోర్టు కూడా 9వ తేదీ ఉత్తర్వులు ఇస్తామని చెప్పడంతో సినిమాను మేకర్స్ వాయిదా వేశారు. మొత్తానికి జన నాయగన్ మూవీ రిలీజ్.. మేకర్స్ తలనొప్పిగా మారింది. ఇప్పుడు కోలీవుడ్ కు చెందిన పలువురు కూడా మద్దతు తెలిపారు. ఏదేమైనా దానయ్య మాత్రం సేఫ్ అయ్యారు.. ఆ ఒత్తిడి, తలనొప్పి నుంచి తప్పుకున్నారు. అందుకే ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు చెబుతుంటారు. అది ఇలాంటి సిచ్యువేషన్స్ కు బాగా సింక్ అవుతుంది.

Tags:    

Similar News