అప్పుడు తమన్నా ఊపుడు.. ఇప్పుడు మనోహరి దూకుడు: 'జైలర్ 2' బిందాస్ సాంగ్ ఏంద‌యో!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం `జైలర్ 2` నుండి తాజాగా `బిందాస్` సాంగ్ విడుదలైంది.

Update: 2026-09-30 14:30 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం `జైలర్ 2` నుండి తాజాగా `బిందాస్` సాంగ్ విడుదలైంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ గ్లామర‌స్‌ బ్యూటీ నోరా ఫతేహి ప్రత్యేక నృత్యంతో అలరించారు. అప్పుడు `జైలర్` చిత్రంలో ``కావాలా...`` అంటూ తమన్నా నడుము ఊపునకు ఎలాంటి క్రేజ్ వచ్చిందో... ఇప్పుడు అదే స్థాయిలో నోరా ఫతేహి డాన్స్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఈ పాటకు సంబంధించి సంగీత ప్రియుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. నోరా ఫతేహి తన క్లాసిక్ - చిల్లింగ్ స్టెప్పులతో స్టేజ్‌ను షేక్ చేసినా.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన బాణీ మాత్రం కొంత నిరాశపరిచాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అనిరుధ్ గతంలో ఇచ్చిన కొన్ని చార్ట్‌బస్టర్ పాటలతో పోలిస్తే.., ఈ సాంగ్‌లో వినిపించిన రొటీన్ అరవ దరువు మ్యూజిక్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు హిందీ- అర‌వం క‌లిపిన లిరిక్ అంత‌గా ఆక‌ట్టుకోలేదు.

నోరా ఫతేహి తన అద్భుతమైన గ్లామర్ - డ్యాన్స్ స్కిల్స్‌తో పాటను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. అనిరుధ్ మ్యూజిక్ మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గోల్డెన్ కలర్ కాస్ట్యూమ్‌లో దేవ‌తా సుంద‌రిలా మెరిసిపోయిన‌ నోరా వేసిన మాస్ స్టెప్పులు ఎంతగా అలరించాయో.. అదే సమయంలో రిపీటెడ్ ట్యూన్స్ వల్ల మ్యూజికల్ పరంగా కొంత బోరింగ్ అనిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు.. ఒకే చిత్రంలో ఇలా రెండు స్పెషల్ డ్యాన్స్ నంబర్లు ఉండటంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే `అలా బోలేలో` పాటలో షమ్నా కాసిమ్ (పూర్ణ) అలరించగా.. ఇప్పుడు నోరా ఫతేహితో రెండో సాంగ్ తీసుకొచ్చారు. రజినీకాంత్ లాంటి లెజెండరీ హీరో సినిమాలో ఇలా ఐటెం సాంగ్స్ ఎక్కువైపోతున్నాయని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మాస్ ఆడియన్స్‌కు మాత్రం ఈ నైట్ క్లబ్ వైబ్స్ బాగా నచ్చాయని మరికొందరు సమర్థిస్తున్నారు.

మొత్తానికి నోరా ఫతేహి డాన్స్ మూమెంట్స్ - గ్లామర్ ఈ పాటకు ప్రధాన హైలైట్‌గా నిలిచినా.. అనిరుధ్ రొటీన్ మ్యూజిక్ ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయిందనేది ట్రేడ్ వర్గాల టాక్. ఏది ఏమైనా సూపర్‌స్టార్ క్రేజ్ -నోరా క్రేజ్ కారణంగా ఈ `బిందాస్` సాంగ్ మాత్రం యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతూ ట్రెండింగ్‌లో నిలిచింది.



Full View


Tags:    

Similar News