• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జై హనుమాన్.. కిక్కిచ్చెలా...

జై హనుమాన్.. కిక్కిచ్చెలా ప్లాన్ చేస్తున్నారు

| త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నాము అంటూ ఈ సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది అనేలా వివరణ ఇచ్చాడు.

By - Tupaki Desk
Update: 2024-03-02 11:52 GMT

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా హనుమాన్ టాప్ లిస్టులో చేరిపోయింది. ఒక విధంగా ఈ సినిమా సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్ లో వచ్చి మిగతా ఇండస్ట్రీలలో కూడా గట్టిగానే ఇంపాక్ట్ చూపించింది. సినిమాలో కంటెంట్ పై అభిప్రాయాలు పలు రకాలుగా ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ మాత్రం అసలు తగ్గలేదు. సినిమా దాదాపు 100 కోట్లకు పైగానే లాభాలను అందించడం విశేషం.

అలాగే ఈ సినిమాలో పెద్దగా స్టార్ క్యాస్ట్ కూడా లేదు. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ కథానాయకుడిగా నటించాడు. ఇక యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలివైన స్క్రీన్ ప్లే తో కమర్షియల్ గా ఫాంటసీ కథను జోడించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా విడుదలైన మొదట్లోనే వరుసగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. చూస్తూ ఉండగానే 50 రోజుల వేడుకను కూడా జరుపుకోవడం విశేషం.

రీసెంట్గా సినిమాకు సంబంధించిన 50 డేస్ వేడుకను నిర్వహించారు. ఇక ఇదివరకే ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి జై హనుమాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇక ఆ సినిమాకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నట్లు ప్రశాంత్ వర్మ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నాము అంటూ ఈ సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది అనేలా వివరణ ఇచ్చాడు.

హనుమాన్ సినిమాలో చివరి ఐదు నిమిషాలు ఎపిసోడ్ చాలా హైలెట్ హ నిలిచింది. అయితే ఇప్పుడు సీక్వెల్ లో మాత్రం అంతకుమించి రెండు గంటలపాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని వివరణ ఇచ్చాడు. జై హనుమాన్ లో హనుమాన్ క్యారెక్టర్ మొత్తం కథలో కొనసాగుతుంది అని వివరణ ఇచ్చాడు.

అయితే ఆ పాత్రలో ఏ హీరో కనిపిస్తాడు అనే విషయంలో మాత్రం ఇంతవరకు సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. రానా పేరు ఆ మధ్య బాగా వైరల్ అయింది. అలాగే మరొక స్టార్ హీరో పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. కానీ ప్రశాంత్ వర్మ హీరో విషయంలో మాత్రం అప్పుడే క్లారిటీ ఇవ్వాలని అనుకోవడం లేదు. ఫస్ట్ లుక్ విడుదల టైం లోనే ఆ హీరో పేరు ఫేస్ తో కిక్కిచ్చేలా అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Tags:    
  • Jaihanuman 
  • Prashantvarma 
  • Tollywood 
  • Tejasajja 
  • Hanumanmovie 
  • Prashanthvarmauniverse 
  • Firstlookupdate 

Similar News

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

Copyright @2026

Powered by Blink CMS