వయసు పెరిగింది కానీ బుద్ధి రాలేదు!

హాలీవుడ్‌లో సరికొత్త తరహా రియాలిటీ స్టంట్ కామెడీతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న`జాకాస్` క్రూ మళ్లీ ఒకచోటికి చేరింది.

Update: 2026-06-16 09:30 GMT

హాలీవుడ్‌లో సరికొత్త తరహా రియాలిటీ స్టంట్ కామెడీతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న`జాకాస్` క్రూ మళ్లీ ఒకచోటికి చేరింది. దశాబ్దాలుగా ప్రాణాలకు తెగించి వింతైన.. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులను నవ్వించిన బృందం చివరి చిత్రం కోసం మళ్లీ చేతులు కలపడం విశేషం. వయసు పెరిగినా వారిలోని క్రేజీ ఆలోచనలు, సాహసాలు ఏమాత్రం తగ్గలేదని తాజా చిత్రం నిరూపించబోతోంది. అభిమానులకు ఇదొక మరుపురాని అనుభూతిని మిగల్చనుంది.

ఈ తాజా ప్రాజెక్ట్ కేవలం స్టంట్స్ ..కామెడీకే పరిమితం కాకుండా ఎంతో భావోద్వేగ భరితంగా సాగనుంది. `వయసు పెరిగింది కానీ బుద్ధి రాలేదు` అనే చమత్కార నినాదంతో వ‌స్తోన్న‌ ఈ చిత్రంలో నటీనటులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే శారీరక పరిమితులను దాటి సరికొత్త సాహసాలు చేయడానికి సిద్ధపడ్డారు. దశాబ్దాల ప్రయాణంలో వారి మధ్య ఏర్పడిన బంధం? అనురాగం ఈ చివరి చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

జాకాస్ ప్రయాణం ప్రారంభమైన రోజుల్లో యువకులుగా ఉన్న వీరంతా ఇప్పుడు వృద్ధాప్యానికి చేరువవుతున్నారు. జానీ నాక్స్‌విల్లే, స్టీవ్-ఓ వంటి ప్రముఖ తారలు తమ శరీరాలు మునుపటిలా సహకరించకపోయినా? కేవలం ప్రేక్షకుల కోసం ..తమకున్న ప్యాషన్ కోసం మళ్లీ రిస్క్ చేయడానికి వెనుకాడలేదు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న శారీరక సవాళ్లు, గాయాలు , మానసిక పరిణామాలను కూడా ఈ చిత్రంలో చాలా సహజంగా చూపించబోతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ టెలివిజన్ చరిత్రలో .. సినిమా రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా కేవలం సహజమైన ప్రతిచర్యలు .. ఊహించని ఫ్రాంక్‌లతో సాగే ప్రదర్శనలు అనేక మంది యువకులను ఆకర్షించాయి. ఇప్పుడు చివరి చిత్రం ద్వారా ఈ క్రూ తమ సుదీర్ఘ ప్రయాణానికి భావోద్వేగభరితమైన ముగింపు పలకాలని నిర్ణయించుకుంది.

ఈ చిత్రంలో స్టంట్స్‌తో పాటు తెర వెనుక జరిగిన ఆసక్తికర సంభాషణలు, పాత మిత్రుల కలయికలోని ఆనందం, ఇకపై ఇలాంటి సాహసాలు చేయలేమనే బాధ కూడా కనిపించనున్నాయి. నవ్వులు పూయిస్తూనే కళ్లు చెమర్చేలా చేసే సరికొత్త స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒక వినోదాత్మక చిత్రం మాత్రమే కాదు. కాలానికి సంబంధించిన వీడ్కోలు వేడుకగానూ మారనుంది.

పరిశ్రమలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి వివాదాలను సైతం ఎదుర్కొని తమదైన శైలిలో దూసుకుపోయిన జాకాస్ బృందం రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను కొంత నిరాశకు గురిచేసినా? ఈ చివరి చిత్రం వారికి ఒక పండుగలాంటి అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. కాలం మారుతున్నా? వయసు పైబడుతున్నా? తమలోని అసలైన క్రేజీ తనాన్ని కోల్పోకుండా ఉండటమే తమ విజయ రహస్యమని బృందం మరోసారి నిరూపించింది.

Tags:    

Similar News