సాయి ప‌ల్ల‌విని టాలీవుడ్ లైట్ తీసుకుందా?

సాయి పల్ల‌విని క‌థ‌తో, పాత్ర‌తో మెప్పించ‌డం ఎంత క‌ష్ట‌మ‌న్నది ఓ డైరెక్ట‌ర్ రివీల్ చేయ‌డంతోనే బ‌య‌ట‌కు వ‌చ్చింది.;

Update: 2025-11-28 16:30 GMT

సాయి పల్ల‌విని క‌థ‌తో, పాత్ర‌తో మెప్పించ‌డం ఎంత క‌ష్ట‌మ‌న్నది ఓ డైరెక్ట‌ర్ రివీల్ చేయ‌డంతోనే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఓ సినిమా విష‌యంలో ప‌ల్ల‌విని ఒప్పించడానికి త‌న‌కు ఎంత స‌మ‌యం ప‌ట్టిందో? ఎన్ని సిట్టింగ్ లు వేసి ఒప్పించాడో పూస గుచ్చి మ‌రీ చెప్పాడు. ఆమెను ఒప్పించే స‌రికి త‌ల ప్రాణం తొక వ‌ర‌కూ వ‌స్తుంద‌ని ఓపెన్ గానే చెప్పాడు. ప‌ల్ల‌విని క‌న్విన్స్ చేయ‌డం అన్న‌ది ఏ డైరెక్ట‌ర్ కి అయినా పెద్ద స‌వాలే అన్నాడు. పాత్ర విష‌యంలో సాయి ప‌ల్ల‌వి అంత సెల‌క్టివ్ గా..ఎన‌లిటిక్ గా ఉంటుంద‌ని అంత వ‌ర‌కూ ఎవ‌రూ ఊహించ‌లేదు. ఆమె న‌టించిన చివ‌రి తెలుగు సినిమా కూడా అదే.

బాలీవుడ్ పై మ‌క్కుతో టాలీవుడ్ లైట్:

ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ చిత్రం త‌ర్వాత మ‌ళ్లీ అమ్మ‌డు మ‌రో తెలుగు సినిమాకు కూడా క‌మిట్ అవ్వ‌లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో `రామాయ‌ణం`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా తెర‌కెక్కుతోన్న రామాయ‌ణంలో ఇప్ప‌టికే మొద‌టి భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. రెండ‌వ భాగం షూటింగ్ జ‌రుగుతోంది. ఈ మ‌ధ్య లో `మేరే ర‌హే` అనే మ‌రో హిందీ చిత్రంలోనూ నటించింది. ఈ చిత్రం వ‌చ్చే నెల‌లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడీ బ్యూటీ హిందీ సినిమాల‌పై చూపించినంత శ్ర‌ద్ద తెలుగు సినిమాల‌పై చూపించ‌డం లేద‌నే ఆరోప‌ణ కొన్ని నెల‌లుగా వ్య‌క్త‌మ‌వుతూనే ఉంది.

ఆమె రాజీ ప‌డ‌ని నటి:

`తండేల్` త‌ర్వాత వ‌చ్చిన చాలా అవ‌కాశాలు కూడా వ‌దులుకుంద‌ని ప్రచారంలోకి వ‌చ్చింది. తాజాగా మ‌రో కొత్త అంశం తెర‌పైకి వ‌చ్చింది. టాలీవుడ్ ని ఆమె లైట్ తీసుకోవ‌డం లేదు..టాలీవుడ్డే ఆమెని లైట్ తీసుకుందానే కొత్త ప్ర‌చారం మొద‌లైంది. తెలుగు సినిమా హీరోయిన్ అంటే గ్లామ‌ర్ బ్యూటీగానూ క‌నిపించాలి. కేవ‌లం న‌ట‌న‌తో స‌రి పెడ‌దాం? అంటే అన్ని వేళ‌లా కుద‌ర‌దు. స‌న్నివేశం డిమాండ్ చేసిందంటే? కొన్ని విష‌యాల్లో రాజీ త‌ప్ప‌దు. కానీ సాయిప‌ల్ల‌వి ద‌గ్గ‌ర అలాంటి స‌న్నివేశాలంటే అంగీకరించ‌దు. తెర‌పై రొమాంటిక్ స‌న్నివేశాలకు..మోడ్ర‌న్ దుస్తుల్లో గ్లామ‌ర్ షో చేయ‌మంటే ఎంత మాత్రం అంగీక‌రించ‌దు.

ఆమె తో టైమ్ వేస్ట్ అనేసారా:

క‌థ‌ల ప‌రంగానూ ఎంతో సెల‌క్టివ్ గా ఉంటుంది. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టు కునే ఓ ద‌ర్శ‌క నిర్మాత సాయి ప‌ల్ల‌విని త‌న సినిమాలోకి తీసుకుందామ‌నుకున్నా? వెన‌క్కి త‌గ్గిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. అది పెద్ద ప్రాజెక్ట్ అయినా ప‌ల్ల‌వి అంగీక‌రించ‌ద‌ని..ఆమె చుట్టూ తిరిగి అన‌వ‌స‌రంగా స‌మ‌యం వృద్దా చేసుకోవ‌ద్ద‌ని అందులో హీరో కూడా సూచించాడుట‌. టాలీవుడ్ లో అగ్ర బ్యాన‌ర్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఓ పేరున్న నిర్మాత కూడా సాయిప‌ల్ల‌వితో గ‌తంలో త‌మ‌కెదురైన అనుభ‌వాలు కూడా చెప్ప‌డంతో? ఆమె ఆలోచ‌న‌నే విరిమించుకున్న‌ట్లు గుస గుస వినిపిస్తోంది.

Tags:    

Similar News