ఇరుముడి కోసం జీవీ స్పెషల్ ట్రీట్.. ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ గ్యారంటీ?
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ సినిమా కోసం రెండు పవర్‌ఫుల్ అయ్యప్ప సాంగ్స్ కంపోజ్ చేశారట.
మాస్ మహారాజా రవితేజ కెరీర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. గత కొన్ని రోజులుగా ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి. ఇటీవల విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ, అది బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్ స్థాయికి చేరుకోలేదు. దీంతో ఇప్పుడు రవితేజ ఆశలన్నీ తన తర్వాతి సినిమా ఇరుముడిపైనే ఉన్నాయి.
డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే ఇండస్ట్రీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం దాని కథాంశం, నేపథ్యం అని చెప్పొచ్చు. అయ్యప్ప స్వామి భక్తి, ఆధ్యాత్మికత, యాక్షన్, ఎమోషన్ అంశాలను కలగలిపి శివ నిర్వాణ ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ సినిమా కోసం రెండు పవర్‌ఫుల్ అయ్యప్ప సాంగ్స్ కంపోజ్ చేశారట. అందులో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బంగారు పల్లకి సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందని చెబుతున్నారు. సాధారణంగా రవితేజ సినిమాల్లో మాస్ బీట్‌లు, కమర్షియల్ సాంగ్స్ హైలైట్‌గా ఉంటాయి. కానీ ఈసారి భక్తి సంగీతాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇరుముడి కేవలం భక్తి నేపథ్యంలో సాగే సినిమా మాత్రమే కాదని, రవితేజ కెరీర్‌లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రాజెక్ట్‌గా నిలవబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆడియన్స్ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో, మేకర్స్ కూడా కథలో ఎమోషన్స్ కు పెద్దపీట వేసినట్లు సమాచారం. ముఖ్యంగా అయ్యప్ప మాల ధరించే భక్తుల జీవితాల్లోని అనుభవాలు, విశ్వాసం, త్యాగం వంటి అంశాలు కథలో కీలకంగా ఉండబోతున్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
శివ నిర్వాణ ఎమోషనల్ కథలను తెరపై బలంగా చూపించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ కావడంతో, రవితేజ మాస్ ఇమేజ్‌కు ఈ ఎమోషనల్ టచ్ తోడైతే ఫలితం మరింత బలంగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగస్టు 21న విడుదల కానున్న ఇరుముడి రవితేజకు మరోసారి భారీ విజయాన్ని అందిస్తుందా? లేక ఆయన కెరీర్‌లో కొత్త మలుపు తిప్పే సినిమాగా నిలుస్తుందా? అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.