క్రియేటర్స్ మన కామెంట్స్‌తో ఎలా డబ్బు చేసుకుంటున్నారో మీకు తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్నప్పుడు "కామెంట్ ఫర్ లింక్" అనే మాట మీకు తరచూ వినిపించే ఉంటుంది.

Update: 2026-06-22 13:30 GMT

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్నప్పుడు "కామెంట్ ఫర్ లింక్" అనే మాట మీకు తరచూ వినిపించే ఉంటుంది. వంటల రెసిపీల నుండి షాపింగ్ సామాన్ల వరకు ప్రతిదానికీ క్రియేటర్లు కామెంట్లు పెట్టమని అడుగుతుంటారు. అలా మనం పెట్టే ఒక చిన్న కామెంట్‌తో వాళ్లు ఎలా లాభపడుతున్నారు? అసలు ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లో లింక్ ఇవ్వకుండా ఇలా ఎందుకు అడుగుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం..

లింకులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి?:

ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పెద్ద లిమిటేషన్ ఉంది. మనం రీల్ కింద రాసే క్యాప్షన్‌లో ఎలాంటి క్లిక్ చేయగల లింకులను పెట్టడానికి వీలుండదు. బయో లో లింక్ పెట్టినా, జనాలు రీల్ వదిలేసి ప్రొఫైల్‌లోకి వెళ్లి వెతకడానికి బద్ధకిస్తారు. అందుకే, క్రియేటర్లు సరికొత్త ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను వాడుతున్నారు. ఇక మనం ఒక ఓ పదాన్ని కామెంట్ చేయగానే, ఆ టూల్స్ ఆటోమేటిక్‌గా మన ఇన్‌బాక్స్‌కు ఆ ప్రొడక్ట్ లింక్‌ను పంపేస్తాయి.

అల్గారిథమ్‌ను బురిడీ కొట్టించే ట్రిక్:

ఈ కామెంట్ల వెనుక మరో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. ఒక రీల్‌కి ఎంత ఎక్కువ కామెంట్లు వస్తే, ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ దాన్ని అంత గొప్ప కంటెంట్‌గా భావిస్తుంది. ఇక జనాలు లింక్ కోసం వందల సంఖ్యలో కామెంట్లు పెడుతుంటే, ఆ రీల్ మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దీనివల్ల క్రియేటర్ల వీడియోలు వైరల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

కామెంట్లు పెడితే డబ్బులు వస్తాయా?:

చాలా మంది అనుకునేలా కేవలం కామెంట్ పెట్టినందుకో లేదా ఆ లింక్‌ను క్లిక్ చేసినందుకో ఇన్‌స్టాగ్రామ్ గానీ, బ్రాండ్లు గానీ డబ్బులు ఇవ్వవు. చాలా వరకు బ్రాండ్లు క్రియేటర్లకు ఒక వీడియో చేయడానికి ఇంత అని ఫిక్స్‌డ్ అమౌంట్ ఇస్తాయి. అయితే కొన్ని అఫిలియేట్ లింకులు కూడా ఉంటాయి. మనం ఆ లింక్ ఓపెన్ చేసి ఏదైనా వస్తువు కొంటే లేదా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే, క్రియేటర్లకు దాదాపు 5% నుండి 20% వరకు కమీషన్ లభిస్తుంది.

చివరగా చెప్పాలంటే.. "కామెంట్ ఫర్ లింక్" అనేది క్రియేటర్లు మరియు బ్రాండ్లు కలిసి ఆడుతున్న ఒక తెలివైన బిజినెస్ గేమ్. దీనివల్ల యూజర్లకు కావాల్సిన వస్తువుల లింకులు నేరుగా మెసేజ్‌లోకి వచ్చేస్తాయి, అటు క్రియేటర్లకు రీచ్‌తో పాటు సంపాదన కూడా పెరుగుతుంది. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ పెట్టేటప్పుడు.. మీరు వాళ్ల బిజినెస్‌లో భాగం అవుతున్నారని గుర్తుంచుకోండి..

Tags:    

Similar News