భారీ బడ్జెట్ చిత్రాలు.. అప్ కమింగ్ కాస్ట్లీ మూవీ లిస్ట్ ఇదిగో!

బడ్జెట్.. ఇది భాషతో సంబంధం లేకుండా ఏ సినిమాకు అయిన మెయిన్ పిల్లర్. అది లేకుంటే మూవీనే లేదు.;

Update: 2025-11-18 12:30 GMT

బడ్జెట్.. ఇది భాషతో సంబంధం లేకుండా ఏ సినిమాకు అయిన మెయిన్ పిల్లర్. అది లేకుంటే మూవీనే లేదు. దాని చుట్టూనే అంతా తిరుగుతుంది. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బడ్జెట్ రేంజ్ కొన్నాళ్ల క్రితం మారిపోయింది. ఒకప్పుడు తక్కువలోనే బడ్జెట్ లెక్కలు ఉండేవి. కానీ ఇప్పుడు వందల వేల కోట్ల వ్యయంతో అనేక సినిమాలు రూపొందుతున్నాయి.

భారీ స్థాయిలో నిర్మించేందుకు, పెద్ద ఎత్తున ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు హై బడ్జెట్ లు పెడుతున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. అలా ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. త్వరలోనే ఆ కాస్ట్లీ సినిమాలు.. థియేటర్స్ లో విడుదలవుతున్నాయి. మరి టాప్-5 అత్యంత బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల గురించి తెలుసుకుందాం.

2 భాగాలు.. రూ.4000 కోట్లు..

ఆ లిస్ట్ టాప్ ప్లేస్ రామాయణ మూవీదే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. నితీష్ తివారి తెరకెక్కిస్తున్నారు. ఏకంగా రూ.4000 కోట్లతో నిర్మాత నమిత్‌ మల్హోత్రా సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. మొదటి పార్ట్‌ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానుంది.

జక్కన్న వారణాసి బడ్జెట్ ఎంతంటే?

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్ లో గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాగా సినిమాను రూపొందిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందుతున్న ఆ మూవీ బడ్జెట్ రూ.1000 కోట్లుగా తెలుస్తోంది. కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఆ సినిమా.. 2027లో థియేటర్స్ లోకి రానుంది.

అల్లు అర్జున్- అట్లీ మూవీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే వివిధ షెడ్యూళ్లు పూరి అయినట్లు తెలుస్తోంది. సినిమాలో నెవ్వర్ బిఫోర్ అనేలా టెక్నాలజీ యూజ్ చేస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. వీఎఫ్ఎక్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని వినికిడి. అయితే మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్.. దాదాపు రూ.800 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు సమాచారం.

కల్కి 2898 ఏడీ సీక్వెల్ సంగతేంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందిన కల్కి 2898 ఏడీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కనుంది. ఇప్పటికే కొన్ని సీన్స్ ఫస్ట్ పార్ట్ టైమ్ లో మేకర్స్ చిత్రీకరించగా.. మరికొద్ది నెలల్లో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రముఖ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న కల్కి సీక్వెల్ బడ్జెట్ రూ.700 కోట్లు అని సమాచారం.

బాహుబలి: ది ఎటర్నల్ వార్ పార్ట్ 1

పై నాలుగు సినిమాల తర్వాత ప్రస్తుతం రూపొందుతున్న మరో హై బడ్జెట్ మూవీ బాహుబలి: ది ఎటర్నల్ వార్ పార్ట్ 1. 3D యానిమేషన్ సినిమాగా తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్టు బడ్జెట్ రూ.120 కోట్లకు పైగా ఉంటుందని ఇటీవల సమర్పకుడిగా వ్యవహరిస్తున్న రాజమౌళి వెల్లడించారు. ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ ఐదు హై బడ్జెట్ సినిమాలు.. ఎలా ఆకట్టుకుంటాయో.. ఎంతటి వసూళ్లను సాధిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News