బిగ్ బాస్ చరిత్రలో రికార్డు సృష్టించిన ఇమ్మాన్యుయేల్..!

బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్ ఇమ్మాన్యుయెల్ చరిత్ర సృష్టించాడు.;

Update: 2025-11-08 04:20 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్ ఇమ్మాన్యుయెల్ చరిత్ర సృష్టించాడు. ఒకే సీజన్ లో 3 సార్లు కెప్టెన్ అవ్వడమే కాదు జరిగిన 9, 10 వారాల్లో కేవలం రెండు సార్లు మాత్రమే నామినేషన్స్ లోకి వచ్చాడు ఇమ్మాన్యుయెల్. ఈ సీజన్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెండర్ గా హౌస్ లోకి వచ్చాడు అతను. ఐతే అతను అందరితో పాటే అతను అనుకోగా హౌస్ లో మిగతా వారు వీక్ అవ్వడంతో అతను చాలా స్ట్రాంగ్ అయ్యాడు. టాస్కులు, కామెడీ ఇలా రెండు విధాలుగా ఇమ్మాన్యుయెల్ అదరగొట్టేస్తున్నాడు.

కెప్టెన్సీ కోసం పట్టు బిగించిన ఇమ్మాన్యుయేల్..

ఐతే ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అతను పట్టు బిగించాడు. హౌస్ లో తనకు సపోర్ట్ గా ఉన్న వారికి తనని మరోసారి కెప్టెన్ చేయమని చెప్పాడు ఇమ్మాన్యుయెల్. అతను ఆల్రెడీ రెండుసార్లు అంటే ఒకసారి కెప్టెన్ అయ్యి సంజన హౌస్ లోకి రావడం కోసం సాక్రిఫైజ్ చేశాడు. రెండోసారి మాత్రం కెప్టెన్ గా వారం మొత్తం చేశాడు. కానీ ఈసారి కెప్టెన్ అవ్వని వారికి ఛాన్స్ ఇవ్వొచ్చు కానీ అతను లేదు నేను మళ్లీ కెప్టెన్ అవుతానని దివ్య, సుమన్ లతో కలిసి డీల్ కుదుర్చుకున్నాడు.

ఐతే హౌస్ మొత్తం తనూజని కెప్టెన్ చేయాలని అనుకోగా దివ్య వచ్చి తనూజని రేసు నుంచి తొలగించి షాక్ ఇచ్చింది. ఇక రీతు, ఇమ్మాన్యుయెల్ మధ్య ఒక చివరి టాస్క్ ఇచ్చి దానిలో గెలిచిన వారు కెప్టెన్ అని చెప్పగా ఇమ్మాన్యుయెల్ ఆ టాస్క్ గెలిచి మళ్లీ కెప్టెన్ అయ్యాడు. ఇమ్మాన్యుయెల్ లెక్క ప్రకారంగా ఈ సీజన్ లో ఇది 3వ సారి కెప్టెన్ అవ్వడం.. ఐతే సంజన కోసం ఒకసారి కెప్టేన్సీ త్యాగం చేశాడు. సో రెండు సార్లు కెప్టెన్ అయ్యాడన్నమాట.

10 వారాల్లో రెండు సార్లు మాత్రమే నామినేషన్స్ లోకి..

ఇక జరిగిన 10 వారాల ఆటలో ఇమ్మాన్యుయెల్ కేవలం మొదటి వారం, నాల్గవ వారం మాత్రమే నామినేషన్స్ లోకి వచ్చాడు. ఆ తర్వాత నుంచి అతను నామినేషన్స్ లోకి రావట్లేదు. మధ్యలో పవర్ అస్త్ర కూడా అతనికి రావడంతో ఇక తిరుగు లేకుండా అయ్యింది. ఐతే ఇన్ని వారాలు నామినేషన్స్ లోకి రాకుండా ఉండటం కచ్చితంగా ఇమ్మన్యుయెల్ ఓటింగ్ తగ్గిపోతుంది. టైటిల్ విన్నర్ అవ్వాలంటే ఆడియన్స్ లో ఓట్ బ్యాంక్ ఉండాలి అది తనూజకి బాగా ఉంది. మరి ఇమ్మాన్యుయెల్ సీజన్ లో టాప్ లో వెళ్లాలంటే కచ్చితంగా నామినేషన్స్ లోకి రావాల్సిందే.

Tags:    

Similar News