IMDB 2025: ఈ ఏడాది అత్యంత ప్రజాదారణ పొందిన నటీనటులు, దర్శకులు వీరే!
సాధారణంగా ఐఎండిబి ప్రతినెల అత్యంత ప్రజాధారణ పొందిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.;
సాధారణంగా ఐఎండిబి ప్రతినెల అత్యంత ప్రజాధారణ పొందిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు ఏకంగా ఈ ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఏడాది అత్యంత ప్రజాదారణ పొందిన నటీనటులు, దర్శకుల జాబితాను తాజాగా విడుదల చేసింది. మరి టాప్ 10లో నిలిచిన ఆ నటీనటులు ఎవరు? దర్శకులు ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
అత్యంత ప్రజాధారణ పొందిన నటీనటుల జాబితా..
1. అహాన్ పాండే (సయారా)
2.అనీత్ పడ్డా (సయారా)
3.ఆమీర్ ఖాన్ (సితారే జమీన్ పర్)
4.ఇషాన్ ఖట్టర్ (హోమ్ బౌండ్)
5.లక్ష్య (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)
6.రష్మిక మందన్న (ఛావా, సికందర్, థామా, కుబేర)
7.కళ్యాణి ప్రియదర్శన్ (లోక: చాప్టర్ 1)
8.త్రిప్తి డిమ్రి (దఢక్ 2)
9.రుక్మిణి వసంత్ ( కాంతార: చాప్టర్ 1)
10.రిషబ్ శెట్టి ( కాంతార: చాప్టర్ 1)
అత్యంత ప్రజాధారణ పొందిన దర్శకులు..
1. మోహిత్ సూరి (సయారా)
2. ఆర్యన్ ఖాన్ ( ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)
3. లోకేష్ కనగరాజ్ (కూలీ)
4. అనురాగ్ కశ్యప్ (నిశాంచి, బందర్)
5. పృథ్వీరాజ్ సుకుమారన్ (ఎల్ 2: ఎంపురాన్ )
6. ఆర్. ఎస్. ప్రసన్న (సితారే జమీన్ పర్)
7. అనురాగ్ బసు (మెట్రో ఇన్ దినో)
8. డొమినిక్ అరుణ్ (లోక:చాప్టర్ 1)
9. లక్ష్మణ్ ఉటేకర్ (ఛావా)
10. నీరజ్ గెవాన్ (హోం బౌండ్)
సాధారణంగా సోషల్ మీడియాలో అత్యంత పాపులారిటీ ఉన్న సీనియర్ హీరోలకి , హీరోయిన్లకి ఈ జాబితాలో మొదటి రెండు స్థానాలలో అవకాశాలు లభిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకొని.. ఇప్పుడు ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాలో యంగ్ హీరో, హీరోయిన్ చేరిపోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. అలా సయారా సినిమా ద్వారా బాలీవుడ్ లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రముఖ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు అహాన్ పాండే, ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ బ్యూటీ అనీత్ పడ్డా మొదటి రెండు స్థానాలను దక్కించుకోవడం విశేషం.
టాలీవుడ్ విషయానికి వస్తే రష్మిక మందన్న చేసిన ఛావా, కుబేర, థామా చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. ఈ ఏడాది అత్యంత ప్రజాదారణ కలిగిన నటీనటుల జాబితాలో ఆరవ స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు కాంతార : చాప్టర్ 1 సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు రుక్మిణి వసంత్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఏది ఏమైనా ఈ సెలబ్రిటీలంతా కూడా ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ కలిగిన నటీనటుల జాబితాలో స్థానం సంపాదించుకోవడం విశేషం.