ఆనాటి పాట ఒక కల అంటున్న మాస్ట్రో ఇళయరాజా

సినీ సంగీతం అంటే గాలివాటం గా మారిన వర్తమానంలో ఇళయరాజా లాంటి వారి అసంతృప్తి అర్ధం చేసుకో తగినదే.;

Update: 2025-11-08 03:38 GMT

డెబ్బై దశకంలో సినీ సంగీత ప్రపంచానికి సరికొత్త యువ కెరటంలా దూసుకొచ్చిన వారు ఇళయరాజా. అంతవరకూ ఉన్న ఒక ట్రెండ్ మ్యూజిక్ ని మార్చి తనదైన స్టైల్ తో కొత్త పోకడలు చేర్చి న్యూ ట్రెండ్ ని క్రియేట్ చేశారు ఇళయరాజా. ఆయన సినీ ప్రభ ప్రతిభ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగిపోయింది. ఇళయరాజా సంగీతం పాటలకు ప్రాణం పెట్టి ఎన్నో సక్సెస్ లు ఇచ్చింది అన్నది అతిశయోక్తి కాదు. దిగ్దర్శకులు దిగ్గజ గాయకులు మేటి సినీ కవులు అంతా ఆయనతో కలసి పనిచేయాలని కోరుకునే వారు అంటే ఇళయరాజా టాలెంట్ ని ఎన్నతరమా. ఆయన సంగీతపు సొగసుని ఆస్వాదించడమే తప్ప వంక పెట్టగలమా.

ఈనాటి పాటలు ఎందుకో :

ఆయన అద్భుతమైన సంగీత దర్శకుడు. అటువంటి ఇళయరాజా ఈనాడు వస్తున్న పాటల తీరు మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎందుకు పాటలు వస్తున్నాయో ఏమిటో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతే కాదు ఈనాటి పాటలు ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. ఈ పాటలు ఇలా ఉంటే తమ కాలంలో పాటలు చాలా గొప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. గతకాలం పాటలు వెనక ఒక పెద్ద కృషి ఉందని పాటని సృష్టించేందుకు ఎంతో మంది తెర వెనక కష్టించిన విధానం ఉందని అన్నారు.

అతి పెద్ద ఆర్కెస్ట్రాతో :

సినీ సంగీతం అంటే గాలివాటం గా మారిన వర్తమానంలో ఇళయరాజా లాంటి వారి అసంతృప్తి అర్ధం చేసుకో తగినదే. ఆయన మాటల్లో చెప్పాలీ అంటే గతంలో అరవై మంది దాకా ఒకే చోట కూర్చుని ఒక సమిష్టి పనితీరుతో మంచి పాటను సృష్టించేవారు ఆ పాటకు ప్రాణం పోసిన తరాలుగా నిలిచి ఉండేలా తపస్సు మాదిరిగా చేసేవారు. ఒక పాట ఆనాడు పురుడు పోసుకుంది అంటే ఎంతో మంది ప్రాణం పెట్టేవారు అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఎన్నో రిహార్సల్స్ చేసి :

పాటని కలకాలం నిలిపేందుకు ఎంతో రిహార్సల్స్ చేసేవారమని ఆయన చెప్పారు. అంతే కాదు రికార్డింగ్ పాడే గాయకులు స్టూడియో వివరాలు ఇవన్నీ కచ్చితంగా ఉండేవని చెప్పారు. అలా ఎంతో పరిశ్రమిస్తే తప్ప ఒక నాలుగు నిమిషాల పాట పుట్టేది కాదని అన్నారు అయితే ఇపుడు పాట కోసం సంగీతం చేసే వారు ఒక వరుసలో కూడా కనిపించడం లేదని ఆయన ఆక్షేపించారు.

సంగీతమే జీవితం :

రాగం నా ప్రాణమే అని ఇళయరాజా ఒక పాటను గతంలో సృజించారు. అదే విధంగా సంగీతమే తన జీవితం అని ఆయన అంటున్నారు. తన పాటలలో జీవం ఉందని భావోద్వేగాలు కూడా ఉన్నాయని అందుకే అవి సినీ ప్రేక్షకుల గుండెలను తాకి శాశ్వతం అయ్యాయని చెప్పుకున్నారు. ఈ రోజున ఒక పాట పాడింది ఎవరో ఎవరికీ తెలియదు అని మేల్ సింగర్ పాడింది ఫిమేల్ సింగర్ కి తెలియదు అంతా అలా అయిపోయిందని ఇళయరాజా నిట్టూర్చారు. ఈ రోజుకీ తన పాటలను ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News