ముంబై- హైదరాబాద్ బిర్యానీల పై నటి కామెంట్!
హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఫిదా కానిదెవరు? భాగ్యనగరంలో కాలు మోపిన ఎవరైనా హైదరాబాద్ బిర్యానీ రుచి చూడాల్సిందే.;
హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఫిదా కానిదెవరు? భాగ్యనగరంలో కాలు మోపిన ఎవరైనా హైదరాబాద్ బిర్యానీ రుచి చూడాల్సిందే. కామన్ మ్యాన్ అయినా? సెలబ్రిటీ అయినా బిర్యానీ తినకుండా తిరుగు ప్రయాణ మయ్యేదే లేదు. అదీ హైదరాబాద్ బిర్యానీకి ఉన్న ప్రత్యేకత. వరల్డ్ లోనే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. తాజాగా సోషల్ మీడియా క్వీన్ ఉర్పీ జావెద్ ముంబై...హైదరాబాద్ బిర్యానీ మద్య వత్యాసం చెప్పే ప్రయత్నం చేసింది. ముంబై బిర్యానీ అన్నది పులావ్ లా ఉంటుంది.
అందులో ఆయిల్ తప్ప ఇంకేమీ ఉండదు. కానీ హైదరాబాద్ బిర్యానీ రుచే వేరుగా ఉంటుంది. పేరు పెట్టా ల్సిన పనిలేదు. చాలా రుచికరమైన పుడ్ అనేసింది. అయితే సీ పుడ్స్ మాత్రం హైదరాబాద్ కంటే ముంబై లో నే బాగుంటాయంది. ముంబై కోస్టల్ తీరం కావడంతో అన్నిరకాల చేపలు అందుబాటులో ఉంటాయి. వాటితో రకరకాల స్పెషల్ ఐటమ్స్ తయారవుతుంటాయి. కానీ హైదరాబాద్ కి ఆ ఛాన్స్ లేదు.
సీ పుడ్స్ ఇష్ట పడేది కూడా చాలా తక్కువ మందే. ఆరకంగా సీ పుడ్స్ అక్కడ ప్రత్యేకం కాలేకపోయాయి.బిర్యానీ...చికెన్..మటన్ ఐటమ్స్ కు మాత్రం భాగ్యనగరం ఎప్పటికీ ప్రత్యేకమే. ఇటీవలే హైదరాబాద్ విచ్చేసిన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా హైదరాబాద్ బిర్యానీ గురించి రివ్యూ కూడా ఇచ్చారు. ఇక్కడ బిర్యానీ టెస్ట్ ఇంకెక్కడా ఉండదన్నారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిర్యానీ మాత్రం హైదరా బాద్ బిర్యానీ రుచిని మించి ఉంటుదన్నట్లు పబ్లిక్ వేదికపైనే స్పందించారు.
ఇంకా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, అమితాబచ్చన్ లాంటి బాలీవుడ్ స్టార్లు ఎంతో మంది హైదరాబాద్ బిర్యానీ గురించి ఎన్నో సందర్భాల్లో ముచ్చటించారు. ముంబై, కేరళ, బెంగుళూరు, చెన్నై నుంచి దుగుమతైన భామలు కూడా భాగ్యనగరం నాన్ వెజ్ వంటకాలపై స్పెషల్ రివ్యూలు ఇచ్చిన వారే.