రాజ‌మౌళి మ‌ళ్లీ ఆ రిస్క్ చేస్తారా?

సోష‌ల్ మీడియా వాడకం విప‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో ఎవ‌రికి తోచింది వారు చెప్తూ ఎక్కువ‌గా రూమ‌ర్లు క్రియేట్ చేస్తున్నారు.;

Update: 2026-04-14 05:58 GMT

సోష‌ల్ మీడియా వాడకం విప‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో ఎవ‌రికి తోచింది వారు చెప్తూ ఎక్కువ‌గా రూమ‌ర్లు క్రియేట్ చేస్తున్నారు. వాటిలో సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించి, మ‌రీ ముఖ్యంగా టాప్ స్టార్ల గురించి, వారి సినిమాల గురించి ఎక్కువ‌గా వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ మొద‌లైంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్, రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి సినిమాలో భాగమ‌వుతున్నార‌ని. ఈ మూవీలో శివుడి పాత్ర‌లో హృతిక్ క‌నిపించ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు రావ‌డంతో అప్ప‌టివ‌ర‌కు ఉన్న హైప్ తారాస్థాయికి చేరింది. అంతేకాదు, ఆ రూమ‌ర్లు మొద‌లైన‌ప్ప‌టి నుంచి హృతిక్ శివుడి అవ‌తారంలో ఉన్న‌ట్టు ఏఐ జెన‌రేటెడ్ ఇమేజెస్, ఫ్యాన్ ఆర్ట్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

వార‌ణాసిలో హృతిక్ భాగ‌మ‌వుతున్నార‌నే విష‌యంలో ఎలాంటి అధికారిక నిర్ధార‌ణ లేన‌ప్ప‌టికీ ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌టం గ‌మ‌నార్హం. నిజంగా హృతిక్ శివుడి పాత్ర చేయాల్సి వ‌స్తే ఆయ‌న ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్, మంచి లుక్ క‌లిపి ఆ పాత్ర బాగా ఎలివేట్ అవుతుంది కానీ వార‌ణాసి లాంటి సినిమాకు అదొక్క‌టే స‌రిపోదు, ఆ పాత్ర నెరేటివ్, స్టార్ డైన‌మిక్స్ కూడా ఎంతో కీల‌కం.

ఈ విష‌యంలోనే డిస్క‌ష‌న్స్ ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. వార‌ణాసి మ‌హేష్ బాబు మెయిన్ లీడ్ గా తెర‌కెక్కుతోంది. సినిమా క‌థ మొత్తం ఆయ‌న చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు హృతిక్ లాంటి భారీ స్టార్, ముఖ్యంగా శివుడు లాంటి ప‌వ‌ర్‌ఫుల్ రోల్ లో క‌నిపిస్తే, క‌థ‌ను, ఆడియ‌న్స్ అటెన్ష‌న్ ను అది డైవ‌ర్ట్ చేసే ప్ర‌మాదం లేక‌పోలేదు. చిన్న క్యామియో అయినా, లేదా భారీ పాత్ర అయినా ఆ ప్ర‌భావం ప్రేక్ష‌కుల దృష్టిలో పెద్దదిగా మారే అవ‌కాశ‌ముంది.

అయితే క్యాస్టింగ్ విష‌యంలో రాజ‌మౌళి చాలా కాలిక్యులేటెడ్ గా ఉంటారు. ఆయన గత సినిమాలు చూస్తే, ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్య‌త‌ ఇవ్వడంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ లో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఇద్ద‌రు సమాన స్థాయి స్టార్లు ఉన్నప్పటికీ, ఫ్యాన్ బేస్ మధ్య జరిగిన పోలికలు, చర్చలు, కొన్ని సందర్భాల్లో వివాదాలుగా మారాయి. సినిమా భారీ విజయం సాధించినా, ఆ ఫ్యాన్ వార్స్ మాత్రం ప్రత్యేక చర్చకు కారణమయ్యాయి.

ఆర్ఆర్ఆర్ అంత పెద్ద హిట్టైనా హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య మాత్రం ఇప్ప‌టికీ వార్స్ జ‌రుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో రాజ‌మౌళి మళ్లీ అలాంటి పరిస్థితిని తీసుకొచ్చి రిస్క్ చేస్తారా అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఒకవైపు మహేష్ బాబు, మరోవైపు హృతిక్ రోషన్ లాంటి స్టార్‌ను ఒకే ప్రాజెక్ట్‌లో తీసుకోవడం క‌మ‌ర్షియ‌ల్ గా ఆకర్షణీయమైన ఆలోచన అయినా, పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసే స్ట్రాటజీ అయినప్ప‌టికీ, స‌ద‌రు న‌టుల స్క్రీన్ ప్రెజెన్స్ ను బ్యాలెన్స్ చేయడం చాలా సున్నితమైన అంశం. అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం, ఈ కాస్టింగ్‌పై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. రాజమౌళి లాంటి డైరెక్ట‌ర్ ఎలాంటి డెసిష‌న్ తీసుకున్నా, అది పూర్తిగా కథ, పాత్రల అవసరాలు, మరియు ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయమే అవుతుంది.

Tags:    

Similar News