హృతిక్ మొద‌టి అడుగు దానితో నేనా?

ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ సినీ రంగంలోనే కొత్త అవ‌తార‌మెత్త‌నున్నారు. ఆల్రెడీ హీరోగా భారీ స‌క్సెస్ ను అందుకున్న హృతిక్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.;

Update: 2025-10-07 05:56 GMT

హీరోలు ఓ వైపు యాక్టింగ్ లో బిజీగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు నిర్మాత‌లుగా, డైరెక్ట‌ర్లుగా కొన‌సాగుతున్నారు. ఇప్ప‌టికే ఎంతోమంది హీరోలు సినీ ఇండ‌స్ట్రీలో ప‌లు పాత్ర‌లు పోషిస్తూ స‌క్సెస్‌ఫుల్ గా దూసుకెళ్తుండగా, ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ సినీ రంగంలోనే కొత్త అవ‌తార‌మెత్త‌నున్నారు. ఆల్రెడీ హీరోగా భారీ స‌క్సెస్ ను అందుకున్న హృతిక్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

ప్రైమ్ వీడియోతో క‌లిసి..

HRX ఫిల్మ్స్ పేరిట ఓ బ్యాన‌ర్ ను పెట్టి అందులో సినిమాలు నిర్మించాల‌ని భావిస్తున్న ఈ హ్యాండ్‌స‌మ్ హంక్, త‌న తొలి ప్రొడ‌క్ష‌న్ వెంచ‌ర్ ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో క‌లిసి హృతిక్ ఓ కొత్త ఓటీటీ ప్రాజెక్టును నిర్మించ‌బోతున్నార‌ని, సోనీలివ్ లో ప్ర‌సార‌మ‌వుతున్న ట‌బ్బ‌ర్ అనే వెబ్‌సిరీస్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అజిత్ పాల్ సింగ్ ఈ వెబ్‌సిరీస్ కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం.

హృతిక్ నిర్మాణంలో తొలి ప్రాజెక్ట్

అయితే హృతిక్ నిర్మాణంలో వ‌స్తున్న ఈ తొలి ప్రాజెక్ట్ ఓ సోష‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నుండ‌గా, ఇది ఉమెన్ సెంట్రిక్ సిరీస్ గా తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్ర‌కారం, మ‌ల‌యాళ న‌టి పార్వ‌తి తిరువోతు, ఆల‌య ఫ‌ర్నీచ‌ర్, రామ శ‌ర్మ‌, స‌బా ఆజాద్ తో పాటూ సృష్టి శ్రీవాస్త‌వ ఈ సిరీస్ లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

మూడేళ్లుగా నిర్మాణంలోకి దిగాల‌ని ప్ర‌య‌త్నాలు

సొంత బ్యాన‌ర్ ను స్థాపించి అందులో సినిమాలు నిర్మించ‌డానికి హృతిక్ మూడేళ్లుగా ప్ర‌య‌త్నిస్తుండ‌గా, ఇన్నాళ్ల‌కు ఈ ప్రాజెక్టు క‌న్ఫ‌ర్మ్ అయింది. ఈ సిరీస్‌లోని స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సుల‌తో పాటూ రియ‌లిస్టిక్ స్టోరీ లైన్ ఆడియ‌న్స్ ను త‌ప్ప‌క స‌ర్‌ప్రైజ్ చేస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. 2025 ఆఖ‌రికి ఈ ప్రాజెక్టు షూటింగ్ మొద‌ల‌య్యే ఛాన్సుంది. హృతిక్ నిర్మాణంలో రానున్న మొద‌టి వెంచ‌ర్ కావ‌డంతో ఈ ప్రాజెక్టుపై ఆల్రెడీ ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు.

Tags:    

Similar News