హే భగవాన్ గ్లింప్స్.. నవ్వించడానికి వచ్చేస్తున్నారహో..!
ముందు షార్ట్ ఫిలింస్ లో ఆ తర్వాత సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన సుహాస్ ఈమధ్య లీడ్ రోల్ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు.;
ముందు షార్ట్ ఫిలింస్ లో ఆ తర్వాత సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన సుహాస్ ఈమధ్య లీడ్ రోల్ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. లో బడ్జెట్ సినిమాలే అయినా మంచి కంటెంట్ తో వస్తున్న సుహాస్ సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అఫ్కోర్స్ ఫ్లాపులు కూడా ఉన్నాయి. కానీ వాటిని సుహాస్ బ్యాలెన్స్ చేస్తున్న తీరు బాగుంది. ఈమధ్యనే ఓ భామ అయ్యో రామ సినిమాతో వచ్చిన సుహాస్ లేటెస్ట్ గా హే భగవాన్ అంటూ వస్తున్నాడు.
సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్..
హే భగవాన్ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను త్రిషూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ లో బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీని గోపీ అచర డైరెక్ట్ చేస్తున్నారు. సుహాస్ తో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో నటించిన సుహాని నాగరం ఈ సినిమాలో సుహాస్ తో జత కడుతుంది.
ఇక గ్లింప్స్ విషయానికి వస్తే సుహాస్ ఫ్యామిలీ ఒక బిజినెస్ చేస్తుంది. ఆ బిజినెస్ ఏంటన్నది చెప్పకుండా హీరోయిన్ ని పడేస్తాడు. తీరా హీరోయిన్ కి ఆ బిజినెస్ గురించి తెలిసి హీరోని అడుగుతుంది. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి.. ఇలాంటి బిజినెస్ కూడా చేస్తారా అని హీరోయిన్ ఎందుకు అడిగింది. బిజినెస్ గురించి అడిగితే సుహాస్ తండ్రి అదే మన వీకే నరేష్ చెప్పను బ్రదర్ అని ఎందుకు అన్నాడు. ఈ వివరాలన్నీ తెలియాలంటే హే భగవాన్ చూడాల్సిందే.
మంచి ఎంటర్టైన్మెంట్..
టైటిల్ గ్లింప్స్ కూల్ గా ఎంటర్టైనింగ్ గా ఉంది. తప్పకుండా ఆడియన్స్ కి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాగా హే భగవాన్ వస్తుందని చెప్పొచ్చు. టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై ఆడియన్స్ ని ఎంగేజ్ అయ్యేలా చేశారు మేకర్స్. సుహాస్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ఈ టీజర్ ఇంప్రెస్ చేసింది. మరి టీజర్ లానే సినిమా కూడా ఉంటే సుహాస్ కి మరో సక్సెస్ వచ్చినట్టే.
కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో సినిమాతో తన పాపులారిటీ పెంచుకుంటున్నాడు సుహాస్. ఇక తెలుగు ఆడియన్స్ సినిమాలో ఎవరున్నారు.. ఎంత బడ్జెట్ అన్నది చూడరు. సినిమాలో కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేస్తారు. సుహాస్ సినిమాలు బాగుంటాయ్ అన్న టాక్ ఉంది. సో తప్పకుండా సుహాస్ హే భగవాన్ తో మరో మంచి హిట్ అందుకుంటాడని చెప్పొచ్చు. ఆడియన్స్ ని నవ్విస్తే మాత్రం సినిమాకు తిరుగులేదు. టీజర్ లో ఫన్ తో పాటుగా సినిమాలో ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటే సినిమా గెలిచినట్టే లెక్క.