• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫామ్‌లోకి ఆ హీరోయిన్స్‌.....

ఫామ్‌లోకి ఆ హీరోయిన్స్‌.. ఇక సీనియర్ హీరోలకి నో టెన్షన్‌!

| మొత్తానికి సీనియర్‌ హీరోల యొక్క హీరోయిన్‌ కరువు తీరి పోయే విధంగా అనుష్క, కాజల్‌ అగర్వాల్‌, త్రిష, తమన్నా లు మంచి ఫామ్‌ లోకి వచ్చి రెడీగా ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-25 05:40 GMT

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్‌ స్టార్‌ హీరోలకు ప్రతి సినిమా ప్రారంభం సమయంలో హీరోయిన్స్‌ సమస్య తీవ్రంగా ఉంటుంది. కొత్త వారిని ఎంపిక చేద్దామంటే మరీ వయసు చిన్న వారిగా కనిపిస్తున్నారు. సీనియర్ హీరోయిన్స్ ను తీసుకోవాలంటే వారిలో చాలా మంది ఫేడ్‌ ఔట్‌ అయినట్లుగా అనిపిస్తున్నారు.

సీనియర్‌ హీరోయిన్స్ లో అనుష్క గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కాజల్ పెళ్లి కారణంగా సినిమాలు చేయలేదు. ఇటీవల వీరిద్దరూ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. అనుష్క మిస్‌ శెట్టి గా అలరించింది. చిరంజీవికి జోడీగా కొత్త సినిమా లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాజల్‌ త్వరలోనే బాలయ్య భగవంత్ కేసరి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక పనైపోయింది అనుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా కూడా జైలర్ సినిమాలో కొంత సమయం కనిపించి సందడి చేసింది. ఆమె కూడా సీనియర్‌ హీరోలకు మళ్లీ మోస్ట్‌ వాంటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్రిష రెగ్యులర్‌ గా లేడీ ఓరింటెడ్‌ సినిమాలు చేస్తూ ఉంది. అయితే ఇకపై సీనియర్ స్టార్‌ హీరోలకు జోడీగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి సీనియర్‌ హీరోల యొక్క హీరోయిన్‌ కరువు తీరి పోయే విధంగా అనుష్క, కాజల్‌ అగర్వాల్‌, త్రిష, తమన్నా లు మంచి ఫామ్‌ లోకి వచ్చి రెడీగా ఉన్నారు. వీరి మాత్రమే కాకుండా లేడీ సూపర్‌ స్టార్ నయనతార ఇంకా కొందరు తమిళ్‌ ముద్దుగుమ్మలు కూడా మేము రెడీ అన్నట్లుగా సీనియర్‌ హీరోలతో సినిమాలకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటి వరకు చెప్పుకున్న హీరోయిన్స్‌ తో పాటు శ్రియ కూడా ఏ హీరో తో అయినా సినిమా ను చేసేందుకు రెడీ అన్నట్లుగా ఉంటుంది. కనుక ముందు ముందు స్టార్‌ హీరోలతో సినిమాలు చేయబోతున్న దర్శకులకు ఎలాంటి టెన్షన్‌ లేదు అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Seniorsactors 
  • Chiranjeevi 
  • Venkatesh 
  • Balakrishna 
  • Anushka 
  • Tamaanaah 
  • Trisha 
  • Nayanthara 
  • Kajal 

Similar News

'రామాయణం' బుకింగ్స్.. ఒక్క రోజులో 16 లక్షల టికెట్లు!

2026-11-10 06:39 GMT

మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న కిరణ్ అబ్బవరం దంపతులు.. నిజమెంత?

2026-11-10 06:33 GMT

దర్శకుడి నుంచి నిర్మాతగా.. వెంకీ కుడుముల సినీ ప్రయాణంలో ఆసక్తికర విషయాలు!

2026-11-10 06:13 GMT

'మాయ లేడీ' ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-10 06:09 GMT

రామాయ‌ణం పై బాలీవుడ్ స్టార్స్ సైలెన్స్!

2026-11-10 06:01 GMT

ప్లీజ్ ..రామాయణాన్ని ..రామాయణంగానే తీయండి..!

2026-11-10 06:00 GMT

జగపతిబాబు బిజినెస్ ఐడియాకు చంద్రబాబు కౌంటర్!

2026-11-10 05:39 GMT

హీరో పర్సనల్ ఇష్యూల కారణంగా వరుస ఫెయిల్యూర్స్

2026-11-10 05:14 GMT

తెలుగు హీరో 'సీన్' కోసం చర్చలు..?

2026-11-10 05:04 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

Copyright @2026

Powered by Blink CMS