హీరోలతో రొమాన్స్ మాత్రమే కాదు.. సిస్టర్స్ గా కూడా..

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే హీరోల పక్కన గ్లామర్ రోల్స్ కి మాత్రమే సరిపోతారు అనే రోజుల నుంచి యాక్షన్ పర్ఫామెన్స్ చేసే స్థాయికి చేరుకున్నారు.;

Update: 2026-01-05 11:30 GMT

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే హీరోల పక్కన గ్లామర్ రోల్స్ కి మాత్రమే సరిపోతారు అనే రోజుల నుంచి యాక్షన్ పర్ఫామెన్స్ చేసే స్థాయికి చేరుకున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధం అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు హీరోలతో రొమాన్స్ చేసిన ఎంతో మంది హీరోయిన్లు అదే హీరోల పక్కన సిస్టర్స్ గా నటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే అలా హీరోల పక్కన హీరోయిన్లుగా నటించి, ఆ తర్వాత కాలంలో అదే హీరో పక్కన సిస్టర్స్ గా నటించిన ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

సావిత్రి - ఎన్టీఆర్ :

సావిత్రి, ఎన్టీఆర్ కాంబినేషన్లో మిస్సమ్మ, బండ రాముడు, మాయాబజార్, గుండమ్మ కథ, కుటుంబ గౌరవం, చంద్రహారం వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో వీరిద్దరూ జంటగా నటించారు. అయితే అలా ఎన్నో చిత్రాలలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా చేసిన ఈమె.. ఆ తర్వాత రక్తసంబంధం సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలుగా నటించింది.

శోభన్ బాబు - శ్రీదేవి:

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్న జోడీలలో శోభన్ బాబు - శ్రీదేవి జంట కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో 1979లో వచ్చిన కార్తీకదీపం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇల్లాలు, కక్ష వంటి సినిమాలలో జంటగా నటించి ఆకట్టుకున్నారు. అలా శోభన్ బాబు పక్కన హీరోయిన్గా రొమాన్స్ చేసిన ఈమె.. 1979లో వచ్చిన బంగారు చెల్లెలు చిత్రంలో ఆయనకు సోదరిగా నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే "విరిసిన సిరిమల్లె.. పెరిగే జాబిల్లి" పాట సూపర్ హిట్ గా నిలిచింది

ఎన్టీఆర్ - వాణిశ్రీ:

హీరో హీరోయిన్లుగా వీరిద్దరి కాంబినేషన్లో జీవిత చక్రం, నిండు హృదయాలు, రైతుబిడ్డ, మనుషుల్లో దేవుడు, ఎదురులేని మనిషి, అదృష్ట జాతకుడు వంటి సినిమాలు వచ్చాయి. అయితే చిట్టి చెల్లెలు అనే సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలుగా నటించింది వాణిశ్రీ.

చిరంజీవి - ఖుష్బూ:

వీరిద్దరూ కలసి శుభగృహ గ్రూపు అనే ఒక రియల్ ఎస్టేట్ ప్రకటన కోసం జంటగా కనిపించారు. అయితే అంతకుముందు 2006లో స్టాలిన్ సినిమాలో చిరంజీవికి సోదరి పాత్రలో నటించింది ఖుష్బూ.

చిరంజీవి - నయనతార:

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటించిన నయనతార.. ఇప్పుడు మరొకసారి మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాలో కూడా జతకట్టింది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఇకపోతే చిరంజీవి సరసన హీరోయిన్గా నటించిన ఈమె 2022లో గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించింది.

ఇలా వీరంతా కూడా ఈ హీరోల పక్కన హీరోయిన్గా నటించి ఆ తర్వాత సోదరీమణులుగా కూడా నటించి ఆకట్టుకున్నారు.ఇకపోతే మరికొంతమంది స్టార్ హీరోయిన్స్ ఆ స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించకపోయినా.. చెల్లెలుగా నటించి మెప్పించారు. ఇక ఆ జాబితా విషయానికి వస్తే..

మంచు విష్ణు - కాజల్ అగర్వాల్ (మోసగాళ్లు ), అల్లరి నరేష్ - కార్తీక్ నాయర్ (బ్రదర్ అఫ్ బొమ్మాలి), శ్రీహరి - త్రిష (నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కింగ్), ఉపేంద్ర - నిత్యామీనన్ (సన్నాఫ్ సత్యమూర్తి), రాజశేఖర్ - మీరాజాస్మిన్ (గోరింటాకు), పవన్ కళ్యాణ్ - సంధ్య (అన్నవరం), బాలకృష్ణ - దేవయాని (చెన్నకేశవరెడ్డి) , నితిన్ - సింధుతులాని (ఇష్క్).

Tags:    

Similar News