హీరోయిన్లతో ఏజ్ గ్యాప్.. లాజిక్ చెప్పిన సీనియర్ హీరోలు
నిజానికి 60 ఏళ్ల వృద్ధుడు పాతిక ప్రాయం అమ్మాయి సరసన నటిస్తే దానిని ఏమని పిలవాలి? అలా ఎందుకు జరుగుతుంది? అని ప్రశ్నిస్తే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇచ్చిన సమాధానం ఆసక్తిని కలిగించింది.;
60 వయసు వృద్ధ హీరో సరసన 20 వయసు అమ్మాయి కథానాయికగా నటిస్తే అభ్యంతరాలున్నాయి. 50 లేదా 60 వయసు ఉన్నవారు హీరోలుగా నటిస్తుంటే, 40 వయసు కథానాయిక తల్లి పాత్రలు పోషించాల్సి వస్తోంది. ఇది గ్లామర్ రంగంలో ఉన్న విచిత్రమైన పరిస్థితి! కానీ ఇది తప్పదు.
నిజానికి 60 ఏళ్ల వృద్ధుడు పాతిక ప్రాయం అమ్మాయి సరసన నటిస్తే దానిని ఏమని పిలవాలి? అలా ఎందుకు జరుగుతుంది? అని ప్రశ్నిస్తే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇచ్చిన సమాధానం ఆసక్తిని కలిగించింది. నేను అలా ఎప్పుడూ నటించలేదు అని అమీర్ ఖాన్ చెప్పాడు. అయితే బెబో కరీనా మీకంటే వయసులో చాలా చిన్నది కదా, అయినా మీరు నటించారు! అని `టూమచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్` కార్యక్రమంలో ప్రశ్నించగా, దానికి సమాధానమిస్తూ, మా మధ్య వయసు అంతరం అంత ఎక్కువ కనిపిస్తోందా? అంటూ అమీర్ ఆలోచనలో పడ్డారు. అయితే కథ, పాత్రల డిమాండ్ మేరకు మాత్రమే కథానాయికలను ఎంపిక చేస్తామని అమీర్ ఖాన్ చెప్పారు. కథకు సరిపోయే పాత్రధారులను మాత్రమే ఎంపిక చేస్తామని అన్నారు.
అదే సమయంలో అమీర్ ఖాన్ తో పాటు ఉన్న సల్మాన్ ఖాన్ కూడా దీనిని ధృవీకరించారు. సీనియర్ కథానాయికలతో మేం రెగ్యులర్ గా తెరపై కనిపిస్తే, వీళ్లు ఓల్ట్ అని ముద్ర వేస్తారు ప్రేక్షకులు. అలా కాకుండా ఒక కొత్త అమ్మాయి సరసన నటిస్తే సినిమాకి ఫ్రెష్ నెస్ ఫీల్ వస్తుంది. అందుకోసమే యువకథానాయికలను ఎంపిక చేసుకుంటామని సల్మాన్ తెలిపారు. శ్రీదేవి, మాధురి లాంటి కథానాయికలతో ఇప్పటికీ నటిస్తాము. కానీ ఆ జోడీ పాతదిగా కనిపిస్తుంది.. తాజాదనం కోసం కొత్త వారిని ఎంపిక చేసుకుంటున్నామని అన్నారు.
నిజానికి ఖాన్ ల త్రయం షష్ఠిపూర్తి వయసులో ఉన్నారు. ఇప్పుడు వీళ్లకు కథానాయికలను వెతకడం అంత సులువేమీ కాదు. యువ కథానాయికలు ఖాన్ ల సరసన నటిస్తే, వారిపై విమర్శలు వెల్లువెత్తడం ఖాయం. అయితే అమీర్ ఖాన్ లాంటి హీరో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. సల్మాన్ కూడా ఇటీవలి కాలంలో కథానాయికల ఎంపికల విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు.
ఒక నటుడి కంటే నటి వయసు చాలా చిన్నది ఉంది! అంటే ఆ పాత్ర స్వభావమే అంత అని అమీర్ ఖాన్ అన్నారు. దిల్ చహతా హైలో డింపుల్- అక్షయ్ ఖన్నా మధ్య వయసు అంతరం అలాంటిదే. అక్కడ ఆ పాత్రలకు అది అవసరం. అందుకే అలా ఎంపిక చేసామని తెలిపాడు. అయినా సీనియర్ లు చిన్న వయసు కథానాయికలతో నటించడంలో తప్పేమీ లేదు. తెరపై పాత్ర చనిపోతే ఆ వ్యక్తి నిజంగా చనిపోయినట్టు కాదు కదా! అని కూడా అమీర్ ఖాన్ ప్రశ్నించారు.